Vishwak Sen: మ్యూజిక్ డైరెక్టర్‌కు రోలెక్స్ ఇచ్చిన విశ్వక్

Read Time:  1 min
Vishwak Sen: మ్యూజిక్ డైరెక్టర్‌కు రోలెక్స్ ఇచ్చిన విశ్వక్
FONT SIZE
GET APP

Vishwak Sen: మాస్ కా దాస్ విష్వక్సేన్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్ట్’. “ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ ఫిల్మ్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకలో ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న రవి బస్రూర్‌కు విశ్వక్‌సేన్‌ రోలెక్స్‌ వాచ్‌ను బహుమతిగా అందించి ఆశ్చర్యపరిచారు. చిత్రానికి ఆయన అందించిన సంగీతానికి గుర్తింపుగా ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈ సంఘటన హైలైట్‌గా నిలిచింది.

Read Also: Rajamouli-Mahesh Babu: ‘వారణాసి’లో సినిమాలో విక్రమ్?

జనాలు ఏం కోరుకుంటున్నారు?

ఇంటెన్స్‌ పార్టీ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గాయత్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో దాదాపు 100 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు విశ్వక్. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు ఈ సినిమాకి దూరంగా ఉండాలని విశ్వక్ సేన్ ఈ సందర్భంగా సూచించారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ”చాలా మంది నేను ఏమీ గమనించడం లేదని అనుకుంటారు. కానీ ట్విట్టర్, రెడిట్‌ సహా సోషల్‌ మీడియాలో ఏం ట్రెండ్‌ అవుతుందో చూస్తూ ఉంటా.

Vishwak gave a Rolex to the music director
Vishwak gave a Rolex to the music director

జనాలు ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? అనేది చూసి అన్నీ కలిసి మిక్సీలో వేసి తీసిన సినిమానే ‘కల్ట్‌’. నేను ‘ఫలక్‌నుమా దాస్‌’ తీయక ముందు ఏదైనా సాధించాలన్న కసి, ఆకలి ఉండేది. ఎందుకనో ‘కల్ట్‌’కు ముందు ఆ కసి, కోపం, ఆకలి పదింతలు అయింది. అదంతా పెట్టి ఈ సినిమా తీశా. మీరు టీజర్‌లో చూసింది చాలా తక్కువ. లాస్ట్ లో ఒక షాట్ మాత్రమే పెట్టినా. సినిమాలో చాలా చూస్తారు. ఫ్యామిలీలు, చిన్న పిల్లలు ఈ సినిమాకి దూరంగా ఉండమని నేను సలహా ఇస్తున్నా. గుండె బలహీనంగా ఉన్న ప్రేక్షకులు నా సినిమాకి రావొద్దు” అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.