Vishnu Vinyasam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’: ఎక్కడ చూడాలంటే?

Read Time:  1 min
Vishnu Vinyasam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’: ఎక్కడ చూడాలంటే?
FONT SIZE
GET APP

Vishnu Vinyasam OTT Release Date: వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న శ్రీ విష్ణు, గత నెలలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఫిబ్రవరి 27న విడుదలైన “విష్ణు విన్యాసం” బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Read Also: Gaddar Film Awards 2026: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: హైటెక్స్‌లో తారల సందడి

ఓటీటీ ప్లాట్‌ఫార్మ్, భాషలు

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది.

  • స్ట్రీమింగ్ ప్రారంభం: శుక్రవారం (మార్చి 20) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
  • పాన్ ఇండియా రిలీజ్: కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

కథేంటంటే.. 

ఇందులో హీరో విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్‌ లెక్చరర్‌. జాతకాలు, మూడనమ్మకాలటే అతనికి పిచ్చి.  అందుకే 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది లెక్చరర్‌ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటాయి. మొదట పట్టించుకోకపోయినా విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇంతలో మనీషా ఓ నిజం చెబుతుంది. దీంతో వీరిద్దరి జీవితాలు మలుపు తిరుగుతాయి. మరి ఆ నిజమేంటి?  చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.