తమిళ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విశాల్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కెరీర్‌లో ఇది 36వ చిత్రంగా రూపొందుతుండటం విశేషం. ఈ సినిమా (Vishal Mogudu Movie) కు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రానికి హిట్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించనుండగా, వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం..
Read Also: Tarun Bhaskar: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ విడుదల వాయిదా
ప్రోమో విడుదల
ఈ సినిమాకు తెలుగులో “మొగుడు” (Vishal Mogudu Movie) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ప్రోమోను విడుదల చేసింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మగ మహారాజు’, ‘మదగజరాజా’, ‘యాక్షన్’ సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుండగా,
యోగిబాబు ఒక కీలక పాత్రలో అలరించబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ఫుల్ ఫన్నీగా, మాస్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది. ముఖ్యంగా ‘మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం’ అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: