📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vishal-Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

Author Icon By Anusha
Updated: March 12, 2026 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vishal-Rajendra Prasad: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు దక్షిణాది సినీ పరిశ్రమలో చిచ్చు రేపాయి. ‘కత్తి కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన, అలనాటి నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ.. దిగ్గజ నటుడు ఎం.జి. రామచంద్రన్ (MGR) పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంతారావు పేరు చెబితేనే ఎంజీఆర్ భయపడేవారని, ఆ సందర్భంలో ఆయన ప్రవర్తన గురించి రాజేంద్ర ప్రసాద్ వాడిన పదజాలం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.

Read Also: The Bluff: ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

రంగంలోకి దిగిన విశాల్.. క్షమాపణకు డిమాండ్

రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి గౌరవనీయమైన సీనియర్ నటుడు, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన ఎంజీఆర్ గారిని అంత తక్కువ చేసి మాట్లాడటం తనను షాక్‌కు గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహానుభావుడిని పొగిడేందుకు మరొక మహానుభావుడిని కించపరచడం సరైన పద్ధతి కాదని విశాల్ హితవు పలికారు.

ఈ వ్యాఖ్యలు తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, దీనిపై రాజేంద్ర ప్రసాద్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా పలువురు నటులపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసిన నేపథ్యంలో, తాజా ఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో కూడా ఈ అంశంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Actor Vishal MGR Nadigar Sangam Rajendra Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.