Viral video: హైదరాబాద్‌లో దోమల బెడ‌ద‌పై ఎస్‌ఎస్ కార్తికేయ సెటైర్

Read Time:  1 min
Viral video: హైదరాబాద్‌లో దోమల బెడ‌ద‌పై ఎస్‌ఎస్ కార్తికేయ సెటైర్
FONT SIZE
GET APP
Viral video: హైదరాబాద్‌లో దోమల బెడ‌ద‌పై ఎస్‌ఎస్ కార్తికేయ సెటైర్
SS Karthikeya’s satire on the mosquito menace in Hyderabad.

హైదరాబాద్ లో దోమల సమస్య ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌ రాజమౌళి(S. S. Rajamouli) తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ పోస్ట్ చేసిన ఒక (Viral video) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కార్తికేయ ఒక సినిమా నిర్మాణ పనుల్లో భాగంగా రాత్రిపూట షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Read Also: Pawan Kalyan: పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్.. 2 సినిమాలు సిద్ధం!

గంటల వ్యవధిలోనే వీడియో వైరల్‌

ఈ క్రమంలో షూటింగ్ ప్రదేశంలో దోమలు విపరీతంగా ఉండటంతో యూనిట్ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లైట్ల వెలుతురులో గుంపులు గుంపులుగా తిరుగుతున్న దోమల సమూహాన్ని ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో(Viral video) పంచుకున్నారు. హైదరాబాద్‌లో దోమలు మామూలుగా లేవు, షూటింగ్ చేయడం కూడా కష్టంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. రాజమౌళి సినిమాలోని గ్రాఫిక్స్‌లా ఉన్నాయి ఈ దోమలు అంటూ కొందరు సెటైర్లు, మరికొందరు హైదరాబాద్ మున్సిపల్ అధికారులను, ప్ర‌భుత్వాని ట్యాగ్ చేస్తున్నారు. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నగరంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.