📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Viral Vayyari Song: ‘వైర‌ల్ వ‌య్యారి’ పాట‌కి అదిరిపోయే స్టెప్పులు వేసిన బామ్మ..వీడియో వైరల్

Author Icon By Sharanya
Updated: July 17, 2025 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన తాజా చిత్రం ‘జూనియర్‌’ ఇప్పటికే సంగీత పరంగా హైప్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా “వైరల్ వయ్యారి నేనే..”(Viral Vayyari Song) అనే పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటకు యువత చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కాలు కదిపేలా చేస్తోంది.

గాలి జనార్దన్ రెడ్డి కుమారుడి తెరంగేట్రం

ఈ చిత్రంతో పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి (Kiriti Reddy) హీరోగా పరిచయం అవుతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైబ్రెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వైరల్ వయ్యారి సాంగ్.. స్టెప్పుల హంగామా

“వైరల్ వయ్యారి నేనే… వయసొచ్చిన అణుబాంబును” (Viral Vayyari Song) అనే పాట ఈ సినిమా సాంగ్స్‌లో హైలైట్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ అన్నీ ఈ పాట స్టెప్పులతో నిండి ఉన్నాయి. శ్రీలీల చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ యువతను ఆకట్టుకుంటోంది.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో స్టార్ల సందడి

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్కు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బామ్మ స్టెప్పులు.. స్టేజ్ మీద హంగామా

ఈ ఈవెంట్‌లో వృద్ధ మహిళ ఒకరు “వైరల్ వయ్యారి” పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఎనర్జీ చూసిన యాంకర్ సుమ కూడా వెంటనే స్టేజ్‌పై చేరి డ్యాన్స్ చేశారు. ఆ బామ్మ మరెవరో కాదు.. టీవీ, సినిమాల్లో బామ్మ పాత్రలతో అభిమానుల మనసు దోచిన నటి మణి. వృద్ధురాలిగా కనిపించినా ఆమె డ్యాన్స్‌లో ఉన్న జోష్‌కి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. వీడియోలు వైరల్ అవుతున్న వేళ, నెటిజన్లు “బామ్మ మాస్!”, “ఇలాంటిదే మాకు కావాలి” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి

ఇప్పటికే పాటలకు, ప్రమోషన్ ఈవెంట్స్‌కి వచ్చిన స్పందనను చూస్తుంటే ‘జూనియర్‌’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కిరీటి – శ్రీలీల జోడీ, దేవిశ్రీ సంగీతం, భారీ ప్రమోషన్స్ అన్నీ కలిసి ఈ సినిమాకు సాలిడ్ బజ్‌ను తీసుకొచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: OTT: రేపు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న టాప్ తెలుగు సినిమాలు

Bamma Viral Dance Breaking News Devi Sri Prasad Songs Junior movie latest news Pre Release Event Highlights Sreeleela Dance Telugu News Viral Vayyari song

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.