Latest News: Vikranth: ఓటీటీలోకి ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఎప్పుడంటే?

Read Time:  1 min
Latest News: Vikranth: ఓటీటీలోకి ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఎప్పుడంటే?
FONT SIZE
GET APP

విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్ స్టార్ (Jiohotstar) లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ చిత్రం గత నవంబరులో థియేటర్లలో విడుదలైంది.

Read Also:  Mrunal Takhur: అల్లు అర్జున్ – అట్లీ మూవీ లో మృణాల్?

క‌థ

ఈ సినిమాలో ఆమని, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. చైతన్య (విక్రాంత్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఓ ఎగ్జామ్ సెంటర్ లో కల్యాణి (చాందిని చౌదరి) ను చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ దగ్గరౌతారు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్) వీరి ప్రేమని వ్యతిరేకించడంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు.

vikranth-when-will-santana- praptirastu-arrive-on-ott
vikranth-when-will-santana- praptirastu-arrive-on-ott

త్వరగా బిడ్డని కనేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తాడు చైతు. కాకపోతే పిల్లల విషయంలో తన ప్రయత్నాలు ఫలించవు. దీంతో ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయిస్తాడు. వైద్య పరీక్షలు చేయించుకోగా చైతన్యకి ఓ సమస్య ఉన్నట్లు బయట పడుతుంది. తర్వాత ఏం జరిగింది? తన సమస్య కారణంగా చైతన్య ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు? చివరకు చైతన్య, కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా ?అనేది మిగతా కథ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.