విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘ సంతాన ప్రాప్తిరస్తు ‘. సంజీవ్ రెడ్డి(Sanjeev Reddy) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. 14న రిలీజై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. రీసెంట్‌గా డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో(jio స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు సినిమాల్లో నవంబర్ 1 ర్యాంకింగ్‌లో నిలిచినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు అమెజాన్ ప్రైం వీడియో ఇండియాలో టాప్ 10లో నిలిచింది. కథ, సంగీతం, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సూపర్ బజ్ నడుస్తోంది. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, వెన్నెల కిషోర్, మురళీ ధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు.
Read Also: Mrs Deshpande: ‘మిస్సెస్ దేశ్ పాండే’ ( జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
స్టోరీ ఏంటంటే?
హైదరాబాద్‌లో చైతన్య (విక్రాంత్) (Vikranth) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా వర్క్ చేస్తుంటాడు. చిన్నప్పుడే పేరెంట్స్‌ను కోల్పోయిన అతను హైదరాబాద్‌లో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఓ రోజు తన స్నేహితుడు సుబ్బు (అభినవ్ గోమటం)ను ఎగ్జామ్ సెంటర్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లి కల్యాణి (చాందిని చౌదరి)ని చూసి లవ్‌లో పడతాడు. చైతన్య వ్యక్తిత్వం నచ్చిన ఆమె కూడా ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్లికి సిద్ధమై కల్యాణి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్)ను ఒప్పించేందుకు ఆమె సొంతూరు వరంగల్ వెళ్తాడు.
అయితే, వీరి పెళ్లికి కల్యాణి తండ్రి ఒప్పుకోడు. దీంతో ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. ఓ బిడ్డను కంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చైతన్య అనుకుంటాడు. అయితే, పిల్లల విషయంలో ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయిస్తాడు. అసలు చైతన్యకు ఉన్న సమస్య ఏంటి? తన మామకు చైతన్యకు ఉన్న సవాల్ ఏంటి? చివరకు ఈ దంపతులు పేరెంట్స్ కాగలిగారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: