Vikrant Massey: రిటైర్మెంట్ వార్తలపై నటుడు విక్రాంత్ క్లారిటీ

Read Time:  1 min
Vikrant Massey: రిటైర్మెంట్ వార్తలపై నటుడు విక్రాంత్ క్లారిటీ
FONT SIZE
GET APP

నటుడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey) స‌డ‌న్‌గా సినిమాల‌కు రిటైర్మెంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌కటించి అంద‌రిని షాక్‌కి గురిచేసిన విష‌యం తెలిసిందే. తాజాగా, తన రిటైర్మెంట్ వార్తలపై స్పష్టతనిచ్చారు. ఎక్కువ పని ఒత్తిడి కారణంగా సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకుంటున్నానని, శాశ్వతంగా నటనకు దూరమవుతానని తాను చెప్పలేదని ఆయన వెల్లడించారు.

Read Also: Tollywood: తెలుగులో గుర్తింపు కోసం కాయదు లోహర్ రీ-ఎంట్రీ

Vikrant Massey: రిటైర్మెంట్ వార్తలపై నటుడు విక్రాంత్ క్లారిటీ

రీఛార్జ్ అవ్వడానికి మాత్రమే

’12th ఫెయిల్‌'(12th Fail) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విక్రాంత్, (Vikrant Massey) రోజుకు 16 గంటలు పనిచేయడం వల్ల అలసిపోయి కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన నటనను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సమయం అవసరమని ఆయన పేర్కొన్నారు. గ‌త‌ 2024 డిసెంబర్‌లో 2025లో వచ్చే సినిమాలే నా చివరివి అంటూ ఆయన చేసిన పోస్ట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

అయితే తాను నటనను వదిలిపెట్టడం లేదని, కేవలం రీఛార్జ్ అవ్వడానికి మాత్రమే దూరంగా ఉంటున్నానని చెప్పడంతో ఫ్యాన్స్ తాజాగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆయన కెరీర్ ‘బాలికా వధు’ సీరియల్స్‌తో ప్రారంభమై, 20కి పైగా సినిమాల్లో నటించారు. 2022లో షీతల్‌ను వివాహం చేసుకున్న ఆయనకు వర్దన్ అనే కుమారుడు ఉన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.