📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijay-Trisha: పెళ్లి వేడుకలో సందడి చేసిన విజయ్‌-త్రిష

Author Icon By Aanusha
Updated: March 5, 2026 • 10:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Vijay-Trisha created a buzz at the wedding ceremony

Vijay-Trisha: తమిళ సూపర్ స్టార్ విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజాగా ఒక వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి హాజరుకావడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.చాలా కాలం తర్వాత ఇలా పబ్లిక్‌గా కలిసి కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Read Also: Subedaar: ‘సుబేదార్’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

ఒకే కారులో ఎంట్రీ.. సంప్రదాయ దుస్తుల్లో మెరుపులు

ఈ వివాహ వేడుకకు విజయ్, త్రిష ఇద్దరూ ఒకే కారులో రావడం అక్కడున్న వారిని ఆకర్షించింది. కారు దిగినప్పటి నుండి వేదిక లోపలికి వెళ్లే వరకు వీరిద్దరూ పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జోడీ వీడియోలు ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇప్పటికే వీరిద్దరి స్నేహం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గతంలో కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించినప్పటికీ, తాజాగా మళ్లీ ఒకే కార్యక్రమానికి కలిసి రావడం ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా విజయ్ వెంటే త్రిష నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో వీరి వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.

విజయ్ వ్యక్తిగత జీవితంపై పెరుగుతున్న రూమర్లు

ప్రజంట్ విజయ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. ఒక హీరోయిన్‌తో విజయ్‌కు సన్నిహిత సంబంధం ఉందంటూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో త్రిషతో కలిసి విజయ్ పబ్లిక్‌గా కనిపించడం మరింత చర్చకు దారి తీసింది. ఇంకోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌పై ప్రత్యర్థులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. త్రిష పేరు ప్రస్తావిస్తూ రాజకీయంగా దాడులు చేస్తున్నా, విజయ్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sangeetha Vijay Divorce Rumors Tamil Cinema Vijay-Trisha viral news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.