📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Vijay: ‘జ‌న‌నాయ‌గ‌న్’ షూటింగ్ లో పాల్గొననున్న విజయ్

Author Icon By Anusha
Updated: November 6, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త‌మిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌ దళపతి విజయ్ (Thalapathy Vijay) మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం “జన నాయకన్ (Jananayagan – ప్రజల నాయకుడు)”ఈ చిత్రానికి హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో ‘ఖాకీ’ చిత్రంతో భారీ విజయం సాధించి ప్రేక్షకుల మనసును గెలుచుకున్న విషయం తెలిసిందే.

Read Also: Singer Chinmayi: వైరల్ అవుతున్న సింగర్ చిన్మయి పోస్ట్

ఈ సినిమా సామాజిక, రాజకీయ నేపథ్యం కలిగిన కథతో రూపొందుతోంది. ఇందులో విజయ్ (Vijay) పాత్ర చాలా శక్తివంతంగా, ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 09న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ఇటీవ‌ల విజ‌య్ (Vijay) స‌భ‌లో జ‌రిగిన తొక్క‌స‌లాటాలో 40 మందికి పైగా చ‌నిపోవ‌డంతో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. దీంతో మూవీ కూడా వాయిదా ప‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా అనుకున్న తేదీకే రాబోతుంద‌ని చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.

కొత్త‌ షెడ్యూల్ కూడా ప్రారంభం అయ్యిందని

అలాగే ఈ సినిమా కొత్త‌ షెడ్యూల్ కూడా ప్రారంభం అయ్యిందని త్వ‌ర‌లోనే విజ‌య్ కూడా షూటింగ్‌లో హాజ‌రు కాబోతున్న‌ట్లు సినీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్ సీరియస్ లుక్‌లో, ప్రజల మధ్య నిలబడి ఉండగా కనిపించారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ చిత్రానికి అనిరుధ్ (Anirudh) సంగీతం అందించ‌నుండ‌గా.. క‌న్న‌డ టాప్ బ్యాన‌ర్ కేవీఎన్ ప్రోడ‌క్ష‌న్ ఈ మూవీని నిర్మిస్తుంది. పూజ హెగ్దేతో పాటు ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Jananayagan movie latest news Telugu News Thalapathy Vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.