📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Vijay: ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా

Author Icon By Aanusha
Updated: January 8, 2026 • 7:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై సందిగ్దత నెలకొంది.. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ముందుగా ప్రణాళిక వేసుకుంది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా లభించకపోవడంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది.

Read also: Lalu Prasad Yadav grandson : సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

అధికారిక ప్రకటన

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని పేర్కొంది.”మా శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు ఈ వార్తను తెలియజేయడానికి మేము చాలా విచారిస్తున్నాము. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జన నాయకన్’ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది.

అయితే మా నియంత్రణలో లేని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాపై మీకున్న అంచనాలు, ఉత్సాహం, భావోద్వేగాలను మేము పూర్తిగా అర్థం చేసుకోగలము. ఈ నిర్ణయం తీసుకోవడం మాకు కూడా చాలా కష్టమైన విషయమే. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తాము. అప్పటి వరకు, ప్రేక్షకులు, అభిమానులు ఓపికతో ఉండి మాపై మీ ప్రేమాభిమానాలను ఇలాగే కొనసాగించాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. మీ అచంచలమైన మద్దతే మా ‘జన నాయకన్’ టీమ్‌కు అతిపెద్ద బలం. అది మాకు ఎంతో విలువైనది” అని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రకటనలో పేర్కొంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Jananayagan Postponed latest news Telugu News vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.