టాలీవుడ్‌లో “డైలాగ్ కింగ్” అని పేరొందిన పూరి జగన్నాథ్కి (To Puri Jagannath) ఈ మధ్య కాలంలో ఫామ్ లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ఓ జమానా లో బాక్సాఫీస్ హిట్లు వరుసగా అందుకున్న ఆయన, ఇప్పుడు మాత్రం వరుస ఫ్లాపుల ఊచకోతలో చిక్కుకున్నారు.పూరి తరం దర్శకులు ఒక్కో విజయాన్ని నమోదు చేస్తుండగా, పూరి సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడుతున్నాయి. ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ వంటి భారీ అంచనాల సినిమాకూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.పూరి సినిమాలకు ఓ ప్రత్యేకమైన యూత్ ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాల్లో హీరోల యాటిట్యూడ్, పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకర్షణగా నిలుస్తాయి. కానీ ఇటీవలే ఈ ఫార్ములా క్లిక్ అవట్లేదు.
పూరి – విజయ్ సేతుపతి కాంబోపై భారీ అంచనాలు
ఇటీవలే పూరి తమిళ స్టార్ విజయ్ సేతుపతిని సైన్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ క్రేజీ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరో హైలైట్ ఏంటంటే – ఇందులో బాలీవుడ్ బ్యూటీలు రాధికా ఆప్టే, టబు లాంటి తారలు కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ – అక్కినేని నాగార్జున గెస్ట్ రోల్ (Nagarjuna guest role) చేయనున్నారట. పూరి – నాగ్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన ఎమోషన్. గతంలో వీరిద్దరి కలయికలో ‘శివమణి’, ‘సూపర్’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి.ఇప్పుడు ఈ నూతన ప్రాజెక్టులో నాగ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న ఊహాగానాలు, ఈ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అధికారికంగా ఏదీ కన్ఫర్మ్ కాకపోయినా, ఇది నిజమైతే పూరి ఫ్యాన్స్ కి ఇది మంచి వార్తే!
నాగ్ బిజీ షెడ్యూల్ – రజినీ, ధనుష్ చిత్రాల్లో కీలక పాత్రలు
నాగార్జున ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. ఆయన రజినీకాంత్ కూలీ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ధనుష్ – శేఖర్ కమ్ముల కుబేర సినిమాలోనూ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.అలాంటి టైమ్‌లో పూరి సినిమాలో కూడా నాగ్ నటిస్తే, అది సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది.
ఇకపైనా పూరి బౌన్స్ బ్యాక్ అవుతారా?
ఈ సినిమాతో పూరి బ్యాక్ టు ఫామ్ అవుతాడా అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. విజయ్ సేతుపతి, నాగార్జున, బాలీవుడ్ తారలు – అన్నీ కలిసి ఓ సాలిడ్ కాంబినేషన్‌గా కనిపిస్తున్నాయి.ఈసారి పూరికి హిట్ అవసరం. సినిమా టైటిల్, టీజర్, నటీనటుల అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ, ఈ వార్తలన్నీ ఊహాగానాలే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం – పూరి సినిమా అంటే ఆసక్తికరమైన టాక్ మాత్రం గ్యారంటీ!
Read Also : Sridevi : శ్రీదేవి నోటిలో బంగారు ముక్క ఉంచి అంతిమ సంస్కారాలు..