📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Mani Ratnam: మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి – సాయిపల్లవి?

Author Icon By Anusha
Updated: December 7, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సినిమాలో క్లాసిక్‌ చిత్రాల రూపకర్తగా, మాస్టర్‌ స్టోరీ టెల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు అగ్ర దర్శకుడు మణిరత్నం (Mani Ratnam). ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ఫ్రాంఛైజీతో గ్రాండ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారాయన. అయితే గత చిత్రం ‘థగ్‌లైఫ్‌’ ఫలితం మాత్రం నిరుత్సాహపరచింది. ఈ నేపథ్యంలో మణిరత్నం తాజా సినిమా గురించి తమిళ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: Mahanati Savitri: మహా నటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం

ఇద్దరూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌

లేటెస్ట్‌ టాక్‌ ప్రకారం మణిరత్నం (Mani Ratnam) తన తదుపరి చిత్రాన్ని ఓ ప్రేమకథగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి కీలక పాత్రల్లో నటించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఈ కథకు ఇద్దరూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌ వినిపిస్తోంది. అధికారిక ప్రకటనను వచ్చే జనవరిలో విడుదల చేయాలని, ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Vijay Sethupathi – Sai Pallavi under the direction of Mani Ratnam?

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌కు మొదట శింబును కథానాయకుడిగా తీసుకోవాలని మణిరత్నం ప్లాన్‌ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌లో శింబు భాగం కాలేకపోయారట. ఆ తర్వాత కథకు అనుగుణంగా విజయ్‌ సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం. విజయ్‌ సేతుపతి, మణిరత్నం కాంబినేషన్ కొత్తది కాదు.

మణిరత్నం దర్శకత్వంలో నటించడం అదృష్టం

గతంలో ‘నవాబ్‌’ సినిమాలో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు రెండోసారి ఈ ఇద్దరి కలయిక రిపీట్‌ కాబోతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక నటి సాయిపల్లవి తొలిసారి మణిరత్నం సినిమాలో భాగం కాబోతుండటం సినీ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మణిరత్నాన్ని దర్శకుడిగా తాను ఎంతగానో ఆరాధిస్తానని, ఆయన దర్శకత్వంలో నటించడం తన జీవితకాల స్వప్నమని సాయిపల్లవి (Sai Pallavi) పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆ కోరిక ఇప్పుడు నిజం కాబోతున్నట్లు వార్తలు రావడం పట్ల ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మణిరత్నం దర్శకత్వం వహించిన మొదటి తెలుగు సినిమా ఏది?

మణిరత్నం తొలిసారి తెలుగు భాషలో దర్శకత్వం వహించిన చిత్రం “గీతాంజలి” (1989).

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Mani Ratnam Sai Pallavi Tamil Cinema Telugu News Vijay Sethupathi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.