Vijay Sethupathi: రామాయణం సినిమాలో ‘మక్కల్ సెల్వన్’?

Read Time:  1 min
Vijay Sethupathi: రామాయణం సినిమాలో ‘మక్కల్ సెల్వన్’?
FONT SIZE
GET APP

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నితీష్ తివారీ, దర్శకత్వంలో తెరకెక్కుతున్న, భారీ ప్రాజెక్ట్‌ ‘రామాయణ’ సినిమా లో రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తుండగా, ఆయన తమ్ముడు విభీషణుడి పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కనిపించనున్నారని సమాచారం. అధర్మం వైపు నడిచే అన్నకు, ధర్మం కోసం నిలబడే తమ్ముడికి మధ్య జరిగే పోరాటంలో ఈ ఇద్దరు నటుల నటన సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్జ్ జిమ్మెర్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి విడుదల కానుంది.

Thalapathy Vijay: TVK చీఫ్ విజయ్ కు కోర్టులో ఎదురుదెబ్బ

Vijay Sethupathi: 'Makkal Selvan' in the movie Ramayana?
Vijay Sethupathi: ‘Makkal Selvan’ in the movie Ramayana?

ప్రత్యేక గుర్తింపు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, సుమారు రూ. 4000 కోట్లకు పైగా వ్యయంతో ఈ సినిమా రూపొందుతోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. సన్నీ డియోల్ హనుమంతుడిగా మనల్ని అలరించబోతున్నారు. ఇంతమంది అగ్ర తారలు ఉన్నప్పటికీ, విభీషణుడిగా సేతుపతి చేసే నటనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.విజయ్ సేతుపతి వంటి నటుడు రామాయణంలో భాగం అవ్వడం విశేషం. యష్, సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాల కోసం అభిమానులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.