Vijay Sangeetha Divorce: విజయ్ భార్య సంగీత ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

Read Time:  1 min
Vijay Sangeetha Divorce: విజయ్ భార్య సంగీత ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?
FONT SIZE
GET APP

Vijay Sangeetha Divorce: విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం.. లండన్ లో స్థిరపడిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె. 1996లో వచ్చిన పూవే ఉనక్కాగా సినిమా చూసి ఆమె విజయ్ కు వీరాభిమానిగా మారింది. లండన్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ఆమె విజయ్ కు అనేక లేఖలు రాసింది. అతడిని కలవడం కోసమే లండన్ నుంచి చెన్నై వచ్చింది. షూటింగ్ సెట్ లో విజయ్ ను కలిసి అభినందనలు తెలిపింది. ఆ సమయంలో వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు పెద్దల సమక్షంలో 1999 ఆగస్ట్ 25న పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. సంగీత.. మీడియాకు దూరంగా ఉంటుంది. అలాగే ఆమె సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండరు. నివేదికల ప్రకారం సంగీత రూ.400 కోట్ల విలువైన ఆస్తులకు వారసురాలు అని తెలుస్తోంది.

Read Also: Vishnu Vinyasam Movie Review: శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ చేరినట్టేనా?

విజయ్ – సంగీతలకు జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2023లో విజయ్ – సంగీత మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వారిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా.. ఉన్నట్టుండి ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

Vijay Sangeetha Divorce: Who is Vijay's wife Sangeetha? What is her background?
Vijay Sangeetha Divorce: Who is Vijay’s wife Sangeetha? What is her background?

స్పందించిన టీవీకే పార్టీ

విజయ్ – సంగీత విడాకుల వార్తలపై టీవీకే పార్టీ స్పందించింది. విజయ్ వ్యక్తిగత జీవితం గురించి చర్చించడం అనవసరమని, రాబోయే ఎన్నికలపైనే దృష్టి సారించాలని పేర్కొంది. ”పార్టీ కామ్రేడ్స్! మన పార్టీ నాయకుడి గురించి వచ్చిన వార్తలను చర్చించడం అనవసరం. అది వారి వ్యక్తిగత విషయం. వారి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మన లక్ష్యం, మన చర్యలు ప్రజల కోసమే..ప్రజల గురించి ఆలోచిద్దాం. ఎన్నికలు అనే మహా యుద్ధం సమీపిస్తున్న కొద్దీ, ప్రజల కోసం రాజకీయాలపై దృష్టి సారిద్దాం” అని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.