Vijay Rashmika: అమిత్ షాను రిసెప్షన్‌కు ఆహ్వానించిన కొత్త జంట

Read Time:  1 min
Vijay Rashmika: అమిత్ షాను రిసెప్షన్‌కు ఆహ్వానించిన కొత్త జంట
FONT SIZE
GET APP

Vijay Rashmika: తెలుగు చిత్రసీమలో మరో ప్రేమ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా, ఒకప్పటి రాచరికపు వైభవాన్ని తలపించే ప్యాలెస్‌లో నిన్న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల ఆచారాల ప్రకారం, రెండు భిన్న సంప్రదాయాల్లో జరిగిన ఈ వేడుకలో ఉదయం 10 గంటల శుభముహూర్తానికి రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడు.

Read Also: Vijay Rashmika Marriage: ఒకటైన ‘గీత గోవిందం’ జంట

Vijay Rashmika: అమిత్ షాను రిసెప్షన్‌కు ఆహ్వానించిన కొత్త జంట
Vijay Rashmika: The newlywed couple invited Amit Shah to the reception

విజయ్, రష్మికల వివాహం ఇరు కుటుంబాల ఆచారాల ప్రకారం జరిగింది. ఉదయం 10 గంటల శుభముహూర్తానికి, వేద మంత్రాల సాక్షిగా రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి ముగిసిన కొద్ది గంటల్లోనే ఈ కొత్త జంట తమ వివాహ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, “కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ వారు పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అమిత్ షాతో భేటీ.. రిసెప్షన్‌కు ఆహ్వానం

పెళ్లి వేడుక ముగిసిన వెంటనే ఈ జంట నేరుగా ఢిల్లీకి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను (Minister Amit Shah) ఆయన నివాసంలో విజయ్, రష్మిక మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు గణపతి విగ్రహాన్ని బహూకరించి, తమ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో విజయ్, రష్మిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణలో 4వ తేదీన సాయంత్రం 7 గంటలకు రిసెప్షన్ ప్రారంభమవుతుంది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:


Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.