Vijay Rashmika Marriage: ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్ వేదికగా ఈ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వీరిద్దరూ ఏడడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక కన్నుల పండుగ జరిగింది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కొడవ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకోనున్నారు.
Read Also: Identity Movie: మిస్టరీ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’ ఇప్పుడు తెలుగులో కూడా!
ఆటపాటలతో హోరెరెత్తిన ప్రాంగణం..
ఇకపోతే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు అభిమానులు “విరోష్” అని అభిమానంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ పేరును వీరు స్వాగతిస్తూ “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అంటూ తమ వివాహ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పైగా “విరోష్ ప్రీమియర్ లీగ్” అంటూ ఈ వివాహ వేడుకకు వచ్చిన సన్నిహితులతో క్రికెట్ గేమ్ కూడా ఆడారు..
ఇక నిన్న అట్టహాసంగా సంగీత్, హాల్దీ వేడుకలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని డాన్స్ చేస్తూ అందరిని సంతోషపరిచారు. ఇక అంతేకాదు ఈ వివాహ వేడుకకు హాజరైన బంధుమిత్రులు, సన్నిహితుల కోసం జపనీస్ వంటకాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: