Vijay Deverakonda-Rashmika: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్స్‌కు ఎట్టకేలకూ తెరపడింది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. తాము త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఇరు కుటుంబాల్లోనూ, సినీ వర్గాల్లోనూ సందడి మొదలైంది.
Read Also: Vijay-Rashmika: పెళ్లిని అధికారికంగా ప్రకటించిన విజయ్ దేవరకొండ, రష్మిక
“వెడ్డింగ్ ఆఫ్ విరోష్”.. ఫిబ్రవరి 26న ముహూర్తం
తమ పెళ్లి కోసం “వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అనే పేరు పెట్టారు. ఈ వివాహ వేడుక ఫిబ్రవరి 26న ఉదయ్‌పుర్‌లో జరగనుందని సమాచారం. సోషల్ మీడియాలో ఈ వేడుక కోసం ఉదయ్‌పుర్‌కి బయలుదేరిన వీరిద్దరి వీడియో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ – రష్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘రణబాలి’ అనే చిత్రం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లు చాలాకాలంగా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.
స్నేహానికి మించిన బంధం వారి మధ్య ఉందని వార్తలు వచ్చాయి. తమ బంధంపై అధికారికంగా స్పందించకపోయినా, అప్పుడప్పుడు వారిద్దరూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ వచ్చాయి. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి పీటలేక్కబోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: