దర్శకుడు అనిల్ రావిపూడి ‘పటాస్’ నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకు వరుస హిట్లతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, తాజా చిత్రంగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘ మన శంకరవరప్రసాద్ గారు ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Read also: AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్
నేను రీమేక్‌కు ఒప్పుకోలేదు
విజయ్ (Vijay) గారు తన చివరి సినిమాకు దర్శకత్వం చేయమని అడిగారు. భగవంత్ కేసరి మూవీపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. గతంలో ఈ సినిమాను రీమేక్ చేయాలనే ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చారు. అయితే విజయ్ గారితో స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఉద్దేశంతోనే నేను రీమేక్‌కు ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఇది ఆయన చివరి ఫిల్మ్ కావడంతో, రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో అన్న భయం కూడా ఉంది.
అందుకే దర్శకత్వం చేసే ధైర్యం చేయలేకపోయానని చెప్పారు.అయితే, ‘భగవంత్ కేసరి’ సినిమా విజయ్ గారికి చాలా నచ్చడంతో, ఆయన పట్టుబట్టి ఈ సినిమాను రీమేక్ చేశారని అనిల్ రావిపూడి తెలిపారు. ‘జన నాయగన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొడుతుందనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: