📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమా ..హీరోయిన్‌ ఎవరంటే?

Author Icon By Anusha
Updated: October 11, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులకు మరోసారి సంబరాలను పంచే వార్త వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందించిన తర్వాత, కొంత గ్యాప్ తీసుకుని ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దిల్ రాజు (Dil Raju)నిర్మాణ సంస్థలో తెరకెక్కబోయే ఈ సినిమాకు “రాజావారు రాణిగారు” ఫేమ్ రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, డ్రామా, మాస్ ఎలిమెంట్స్ మేళవింపుగా ఉండే ఈ చిత్రం రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం.

Trisha: పెళ్లి రూమర్స్ పై స్పందించిన త్రిష

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. “కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..” అనే పంచ్ లైన్‌తో, కత్తి పట్టుకున్న రక్తంతో తడిచిన చేయి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు.

సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ (Rayalaseema backdrop) లో నడవనుందని విజయ్ గతంలో వెల్లడించాడు.ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కి మూవీ యూనిట్ అంతా హాజరవగా, అక్కడ నుంచి లీకైన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యేకంగా ఈ ఈవెంట్‌కి కీర్తి సురేష్ (Keerthy Suresh) హాజరుకావడం, ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ అని గట్టి సంకేతాలు ఇస్తోంది.

Vijay Deverakonda

గతంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఉండనుందని రూమర్లు రాగా,ఇప్పుడు ఈ పిక్‌తో క్లారిటీ వ‌చ్చిన‌ట్టే అని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తైన నేపథ్యంలో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విజయ్ దేవరకొండ మాస్ మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ‌ట్టు మరోసారి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనపించనున్నారని టాక్.

ఈ జోడీ ఫ్రెష్ ఫీల్ ఇవ్వ‌డంతో

ఇక కీర్తి సురేష్ వంటి టాలెంటెడ్ నటితో ఈ జోడీ ఫ్రెష్ ఫీల్ ఇవ్వ‌డంతో పాటు సినిమా క్రేజును పెంచుతోంది.‘లైగర్’, ‘ఖుషి’ లాంటి సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు సరైన హిట్ దక్కలేదు.

అయితే ఈసారి దర్శకుడు, కథతో పాటు బలమైన టెక్నికల్ టీమ్‌ను రెడీ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌తో విజయ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా? అన్న ఆసక్తికర ప్రశ్నకు సమాధానం త్వరలోనే లభించనుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీపై అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Dil Raju Keerthy Suresh latest news new movie Telugu News Vijay Deverakonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.