📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి కీలక అప్డేట్

Author Icon By Divya Vani M
Updated: April 15, 2025 • 8:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు ప్రాజెక్ట్ మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు‘కింగ్‌డమ్’ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. వారి ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతా ద్వారా “డబ్బింగ్ వేగంగా జరుగుతోంది. ఫస్ట్ హాఫ్ పూర్తయింది మే 30న థియేటర్లలో మంత్రిముగ్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అంటూ పోస్టు చేశారు.ఈ చిత్రం మొదట VD12 టైటిల్‌తో ప్రమోట్ అయ్యింది.

Vijay Deverakonda విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి కీలక అప్డేట్

కానీ ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్‌కి మారడంతో ఆసక్తి మరింత పెరిగింది రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కి విశేష స్పందన లభించింది 24 గంటల్లోనే కోటి వ్యూస్‌ను దాటి దుమ్ము రేపింది.టీజర్‌లో విజయ్ దేవరకొండ ఓ న్యూ లుక్‌తో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు సిక్స్ ప్యాక్, గంభీరమైన స్వభావం, ఫైట్స్‌తో ఆయన పాత్రలో కొత్తదనం కనిపిస్తోంది. “ద్రోహం నీడల నుంచి ఓ రాజు ఉదయిస్తాడు” అనే ట్యాగ్‌లైన్ టీజర్‌కి హైలైట్ అయింది.ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి జైలు బ్యాక్‌డ్రాప్‌లో కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయి.

ఇది రొటీన్ యాక్షన్ మూవీ కాదని ఇప్పటికే టీజర్ చెప్పేసింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది సినిమా టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. నీరజ్ కోన కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చూస్తున్నారు. యాక్షన్ పార్ట్ కోసం యాన్నిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ లాంటి స్టంట్ మాస్టర్లు పని చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి కావడంతో మిగతా పార్ట్‌కి స్పీడ్ పెరిగిందని తెలుస్తోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి ఇది డబుల్ థ్రిల్. మే 30న థియేటర్లలో ‘కింగ్‌డమ్’ కలెక్షన్ల రాజుగా మారేలా కనిపిస్తోంది.

Read Also : ILaiyaraaja: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా

Gautam Tinnanuri Direction Kingdom Movie Dubbing Completed Sitara Entertainments Kingdom VD12 Movie Latest News Vijay Deverakonda Kingdom Movie Vijay Deverakonda Kingdom Teaser Vijay Deverakonda Latest Movie Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.