📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Vijay Deverakonda: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విజయ్ దేవరకొండ

Author Icon By Ramya
Updated: July 18, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయ్ దేవరకొండ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల ఆందోళన

యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఆసుపత్రిపాలయ్యారు. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఆయనకు డెంగీ జ్వరం (Dengue fever) సోకినట్లు సమాచారం. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో, విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని వారు ప్రార్థనలు చేస్తున్నారు. విజయ్ ఆసుపత్రిలో చేరడం, డెంగీతో బాధపడుతున్నారనే విషయం విజయ్ సన్నిహితులు, అభిమానులకు పెద్ద షాక్ గా మారింది. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Vijay Deverakonda: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ సినిమా అప్డేట్స్

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాల విషయానికి వస్తే, ఆయన తాజా చిత్రం ‘కింగ్ డమ్’ (Kingdom) ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కింగ్ డమ్’ లో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘డాన్ 3’ సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను చిత్ర నిర్మాతలు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే, ‘డాన్ 3’ ఆఫర్ కు విజయ్ ఓకే చెప్పారా, లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ గనుక విజయ్ ఒప్పుకుంటే, ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైనట్లే. ఈ విషయమై అధికారిక ప్రకటన కోసం సినీ వర్గాలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.

విజయ్ దేవరకొండ చరిత్ర ఏమిటి?

విజయ్ దేవరకొండ 1989లో జన్మించి, తెలుగు సినిమా రంగంలో అర్జున్ రెడ్డి వంటి హిట్ సినిమాలతో పేరుగాంచాడు. ఆయన నటనతో పాటు నిర్మాతగా, ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Sir Madam Trailer: విజయ్ సేతుపతి ‘సార్ మేడ‌మ్’ ట్రైల‌ర్ చూసారా!

Breaking News dengue fever hospital treatment Hyderabad private hospital latest news Social Media Telugu News Vijay Deverakonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.