📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Vijay Devarakonda – విజయ్ దేవరకొండతో లిటిల్ హార్ట్స్ టీమ్‌.. ఫోటోలు వైరల్..

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా (Little Hearts) ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తక్కువ బడ్జెట్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్ కావడంతో పరిశ్రమలోనూ మంచి చర్చనీయాంశమైంది. కథలోని నిజాయితీ, కొత్తదనం, నటీనటుల ప్రదర్శన, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాను పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, సుమంత్ వంటి అగ్రతారలు సోషల్ మీడియాలో ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని కొనియాడారు. వీరంతా సినిమాలోని హృద్యమైన కథనాన్ని, యువ దర్శకుడు సాయి మార్తాండ్ తీసిన తీరు, కొత్తతనాన్ని మెచ్చుకున్నారు. సినీ తారల నుంచి వచ్చిన ఈ ప్రశంసలతో సినిమా బృందం ఉత్సాహంగా ఉంది.తాజాగా ఈ జాబితాలోకి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా చేరారు.

కథలోని భావోద్వేగ గాఢత తనను బాగా ఆకట్టుకున్నాయని

ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ప్రత్యేకంగా దర్శకుడు సాయి మార్తాండ్‌ను, హీరో మౌళి తనుజ్‌ (Mauli Tanuj)ను, హీరోయిన్ శివానీని కలుసుకుని అభినందించారు. నటీనటులు చూపిన సహజమైన నటన, కథలోని భావోద్వేగ గాఢత తనను బాగా ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఒక కొత్త దర్శకుడి నుంచి ఇంత హృద్యమైన కథ రాబట్టడం నిజంగా ప్రశంసనీయమని విజయ్ అభిప్రాయపడ్డారని తెలిసింది. 

అనంత‌రం విజ‌య్ త‌న క్లాతింగ్ బ్రాండ్ అయిన రౌడీ బ‌ట్ట‌ల‌ను (Rowdy sticks) హీరో మౌళికి గిప్ట్‌గా ఇచ్చాడు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.యూట్యూబర్ మౌళి తనుజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ సినిమాకు సాయి మార్తండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఆదిత్య హాసన్ నిర్మించారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/balakrishna-balaiahs-film-is-gearing-up-for-a-dussehra-release/cinema/546579/

Breaking News latest news Little Hearts success Sai Marthand director Telugu News Tollywood hit movie Vijay Deverakonda meets Little Hearts team Vijay Deverakonda praises Little Hearts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.