బాలీవుడ్(Bollywood)లో ఇటీవల విడుదలైన సినిమాలు ‘ఛావా’ మరియు ‘ధురంధర్’ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన పొందాయి. ఈ రెండు చిత్రాలు ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని సాధించాయి. కొందరు వ్యాఖ్యానాలు ప్రకారం, ఈ సినిమాల హిట్‌కి ప్రధాన కారణం దేశభక్తి నేపథ్యం అని సూచిస్తున్నారు.
Read Also: Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యునరేషన్
అయితే, హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, సినిమా విజయానికి దేశభక్తి మాత్రమే ఫార్ములా కాదని తెలిపారు. సినిమా విజయం కోసం భావోద్వేగాత్మక సన్నివేశాలు, కథనంలోని డిప్త్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. దేశభక్తి(patriotism) అనేది నిర్వచించలేని భావన. మన సినిమా, సాహిత్యం, క్రీడల ద్వారా దీన్ని నిరంతరం ప్రతిబింబించాలి. దేశంపై గౌరవం, ప్రేమకు ఇది ఉదాహరణ” అని విక్కీ పేర్కొన్నారు.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం
‘ఛావా’లో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికల్ మూవీ ఫిబ్రవరిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.807 కోట్లు వసూలు చేసింది. తాజాగా విడుదలైన ‘ధురంధర్’ సినిమా, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ ఆధారంగా రూపొందింది. 17 రోజులలో రూ.845 కోట్లు వసూలు చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, దేశభక్తి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: