हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Varun Tej: హనుమాన్ మాలలో వరుణ్ తేజ్..

Divya Vani M
Varun Tej: హనుమాన్ మాలలో వరుణ్ తేజ్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే “మట్కా” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో కొంత విరామం తీసుకున్న వరుణ్ తేజ్ తాజాగా భక్తి మార్గంలో అడుగుపెట్టారు. తాజాగా హనుమాన్ మాలను ధరించి ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా దర్శనమిచ్చారు.మెగా కుటుంబానికి దేవుడిపై గాఢమైన విశ్వాసం ఉండడం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తరచూ అయ్యప్ప మాలను ధరించి దీక్షలు తీసుకుంటారు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలు సందర్భాల్లో దీక్షలు చేపట్టారు. ఇప్పుడు వరుసలోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా వచ్చారు. హనుమాన్ మాలను ధరించిన వరుణ్ మంగళవారం (డిసెంబర్ 03) జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వరుణ్ ఆలయానికి చేరుకున్న వెంటనే అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామి వారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాముఖ్యతను, అంతరాలయ విగ్రహ విశిష్టతను వరుణ్‌కి వివరించారు. ఈ దర్శనానంతరం మాట్లాడిన వరుణ్ తేజ్, “కొండగట్టు అంజన్న చాలా పవర్‌ఫుల్ దేవుడు. హనుమాన్ మాలను తొలిసారి ధరించిన నాకు ఆయనను దర్శించుకోవడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నా,” అని అన్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే, వరుణ్ తేజ్ తాజా చిత్రం “మట్కా” ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా, వరుణ్ తేజ్ నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. డిసెంబర్ 05 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా వరుణ్ తేజ్ తన అభిమానులను సంతోషపరచడంతో పాటు, భక్తి మార్గంలో కూడా తన దారిని చూపించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ
1:57

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్
1:49

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

📢 For Advertisement Booking: 98481 12870