సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi Title) పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. 2027లో రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Rajinikanth: ఎన్నిజన్మలెత్తినా రజినీకాంత్‌గానే పుడతా

టైటిల్‌పై వివాదం సద్దుమణిగినట్లు సమాచారం
ముఖ్యంగా ‘వారణాసి’ (Varanasi Title) అనే టైటిల్‌ను తెలుగులో గతంలోనే వేరే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఈ టైటిల్‌పై వివాదం సద్దుమణిగినట్లు సమాచారం.
దీంతో తెలుగులో ‘రాజమౌళి వారణాసి’, మిగిలిన అన్ని భాషల్లో ‘వారణాసి’ పేరుతోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రం 2027 వేసవిలో రిలీజ్ కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: