ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్ కీలక పాత్రల్లో నటించిన సూపర్ హిట్ లవ్ స్టోరీ వాలంటైన్స్ డే సందర్భంగా (Valentine Week 2026) ‘మనసంతా నువ్వే’ మరోసారి థియేటర్లలోకి రానుంది. ఈ నెల 14న, తిరిగి విడుదల కానుంది.. 25 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎం.ఎస్. రాజు నిర్మించారు. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్ రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో 250 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా, ఇప్పటి యువతను కూడా ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
Read Also: Thalapathy Vijay: ఒకే ఫ్రేమ్ లో వైఎస్ జగన్.. కోలీవుడ్ హీరో
మూవీ ఫెస్టివల్
ఫిబ్రవరి మధ్యలో వచ్చే ఈ ప్రత్యేక వారం యువతకు మాత్రమే కాదు, సినీ అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకంగా మారింది. లవ్, ఎమోషన్‌ని ప్రతిబింబించే సినిమాలు ఈ టైమ్‌లో థియేటర్లలో సందడి చేస్తూ యువతలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంటాయి. అందుకే ఏటా ప్రేమికుల దినోత్సవం (Valentine Week 2026) వచ్చిందటే చాలు థియేటర్లు ప్రేమికులతో నిండిపోతుంటాయి. ఈసారి కూడా టాలీవుడ్‌లో వాలంటైన్స్ డే వారం మరింత ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే పాత సినిమాలను మళ్లీ పెద్ద తెరపై చూపించే రీ రిలీజ్ ట్రెండ్ బలంగా కొనసాగుతున్న వేళ ఈ వారం ఏకంగా ఐదు ప్రేమ కథా చిత్రాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో లవ్‌స్టోరీలను ఆరాధించే ప్రేక్షకులకు ఇది మూవీ ఫెస్టివల్‌గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: