Ustad Bhagat Singh: నటనతో, రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు సినిమాలతో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్‌తో కలిసి దిగిన ఒక ఆసక్తికరమైన ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.
పవన్ కల్యాణ్ మీద ప్రశంసలు
షూటింగ్ త్వరగా పూర్తవడానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన సహకారాన్ని హరీష్ శంకర్ గుర్తుచేసుకున్నారు. “మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం.. మీరు పక్కన ఉంటే కరెంట్ పాకినట్లే” అంటూ ఆయన పవన్‌ను ప్రశంసించారు. ఈరోజు షూటింగ్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కూడా తెలిపారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ అంచనాలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు
‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ యాక్షన్ డ్రామాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, పవన్ కాంబినేషన్‌లో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలోని పాటలపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
పవన్ ఇతర సినిమాలు
‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు పవన్ కల్యాణ్ మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’తో ఆయన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే, సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇలా ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో పవన్ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనితో పాటు, పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి ‘వినోదయ సిత్తం’ తెలుగు రీమేక్‌లో కూడా నటించారు.
పవన్ కళ్యాణ్ అతిపెద్ద హిట్ ఏది?
పవన్ కళ్యాణ్ నటించిన ఈ ఐకానిక్ చిత్రం ఆయన కెరీర్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తొలి ప్రేమ ఇటీవలే విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఎడిటర్ ఎవరు?
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ | పవన్ కళ్యాణ్ | హరీష్ శంకర్ | శ్రీలీల – YouTube.
Read hindi news: hindi.vaartha.com
Read also: