Ustaad Bhagat Singh Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన మార్చి 26వ తేదీ కంటే ఒక వారం ముందుగానే, అంటే మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Read Also: Dubai Stranded Passengers: దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా
టాక్సిక్ వాయిదా.. ఉస్తాద్‌కు కలిసొచ్చిన ఛాన్స్!
వాస్తవానికి మార్చి 19వ తేదీన కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వలన, ‘టాక్సిక్’ జూన్ నెలకు వాయిదా పడింది. ఈ ఖాళీని భర్తీ చేస్తూ, పవన్ కళ్యాణ్ సినిమాను ముందుకు తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు. దీనివల్ల ఉగాది పండుగ సీజన్‌ను ఉస్తాద్ టీమ్ భారీగా క్యాష్ చేసుకునే అవకాశం దక్కింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్థిబన్, కెయస్ రవికుమార్, ఎల్.బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కెజిఎఫ్ అవినాష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: