Ustaad Bhagat Singh Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ టీజ్‌ను విడుదల చేశారు. ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయి, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.బ్యాగ్రౌండ్ లో భగవద్గీత వినిపిస్తుండగా.. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మాస్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.
Read Also: Thalapathy Vijay: విడాకుల వార్తలపై స్పందించిన విజయ్
త్వరలోనే పూర్తి స్థాయి ట్రైలర్ కూడా విడుదల
”ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమాలో ఇలాంటి హరీష్ శంకర్ మార్క్ వన్ లైనర్స్, పంచ్ డైలాగులు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. 43 సెకండ్ల ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ను పోలీసాఫీసర్ గెటప్ లో, లుంగీలో, కౌబాయ్ టోపీతో.. ఇలా రకరకాల లుక్స్ లో చూపించారు. యాక్షన్ పాళ్లు ఎక్కువే అని హింట్ ఇచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సినిమా పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి స్థాయి ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. మొత్తానికి మార్చి 19న థియేటర్లలో పండగ చేసుకోవడానికి పవన్ అభిమానులు సిద్ధమవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: