📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ustaad Bhagat Singh Movie Review: పవన్ మాస్ జాతర.. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

Author Icon By Anusha
Updated: March 19, 2026 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ustaad Bhagat Singh Movie Review: ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ జోడీ నుండి వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు తోడవడంతో ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో విశ్లేషిద్దాం.

Read Also: Doraemon Director Passed Away: ‘డోరేమాన్’ సృష్టికర్త కన్నుమూత

కథా నేపథ్యం: అధికార దాహం వర్సెస్ ఉస్తాద్ మార్క్ న్యాయం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలనే పిచ్చితో ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే విలన్ చదలమర్రి నల్లనాగప్ప (పార్థిబన్). అధికారం కోసం అడ్డువచ్చిన వారిని హతమారుస్తూ సీఎం కుర్చీ ఎక్కుతాడు. అతని కొడుకు (కిల్లి క్రాంతి) అంతకంటే రాక్షసుడు. తలకోన ఫారెస్ట్ ఏరియాలో పోలీసులపై దాడి చేస్తూ అరాచకం సృష్టిస్తున్న తరుణంలో ఎంట్రీ ఇస్తాడు ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కల్యాణ్). సీఎం కొడుకుని కిడ్నాప్ చేసి, విలన్ నెట్‌వర్క్‌ను ఎలా దెబ్బతీశాడు? ఉగ్రవాదులకు, ముఖ్యమంత్రికి ఉన్న లింక్ ఏంటి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ: పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో

ఇలాంటి మాస్‌ సబ్జెక్ట్‌ని సదరు హీరో అభిమానులకు నచ్చేలా, ఎక్కడా విసుగులేకుండా తీయగలిగితే సినిమా హిట్టే. దర్శకుడు హరీశ్‌శంకర్‌ ఆ విషయంలో విజయం సాధించాడనే చెప్పాలి. పవన్‌కల్యాణ్‌ అభిమానులు పండుగ చేసుకునేలా సినిమాను తీర్చిదిద్దాడు హరీశ్‌ శంకర్‌. ముఖ్యంగా పవన్‌ కోసం రాసుకున్న కొన్ని డైలాగులు అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా గూజ్‌బంప్స్‌ తెప్పిస్తాయి. పవన్‌కల్యాణ్‌ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్‌ కానీ, ఆ పాత్ర ప్రవర్తన కానీ, ఆ పాత్ర వాడే భాష.. ఇవన్నీ జనాలకు నచ్చేస్తాయి. ప్రథమార్ధం అంతా ప్రశ్నలతోనే ముగించాడు హరీశ్‌శంకర్‌. ద్వితీయార్ధం మొదలైనప్పట్నుంచీ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ, సమాధానాలిచ్చుకుంటూ ఆసక్తికరంగా కథను నడిపాడు.

Ustaad Bhagat Singh Movie Review

అందుకే.. ప్రథమార్ధం కాస్త సోసోగా అనిపించినా.. ద్వితాయార్ధం మాత్రం స్పీడ్‌గా జనరంజకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో శ్రీలీల ఎపిసోడ్‌ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ ఎపిసోడ్‌లో అంతా వింటేజ్‌ పవన్‌ని చూస్తారు. పవన్‌ పాత సినిమాను గుర్తు చేస్తూ అభిమానులకు నచ్చేలా సినిమాను తీశాడు హరీశ్‌ శంకర్‌. ‘తొలిప్రేమ’లోని ‘నీ మనసే..’ పాటను ఈ సినిమాకోసం మళ్లీ వాడేశాడు. ఈ పాట పిక్చరైజేషన్‌ కూడా బావుంది. అయితే.. అక్కడక్కడ కామెడీ కోసం పెట్టిన కొన్ని సన్నివేశాలు పంటికింద రాళలాగా ఇబ్బంది పెడతాయి. మొత్తంగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ’ పైసా వసూల్‌ సినిమా అని చెప్పొచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Harish Shankar Director Mythri movie makers Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.