📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Udaya Bhanu: నాకు జరిగిన అన్యాయాలను వెల్లడిస్తా : యాంకర్ ఉదయభాను

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు బుల్లితెరపై ‘ఎనర్జీ క్వీన్’ గా వెలుగొందిన యాంకర్ ఉదయభాను, అనేక రియాలిటీ షోలు, ఈవెంట్లలో తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరించారు. తన యాంకరింగ్‌లోని ఉత్సాహం, స్పాంటేనియస్ హ్యూమర్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ పెళ్లి, పిల్లల తరువాత కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ కొంతకాలం వినోద రంగానికి దూరమయ్యారు. ఇప్పుడు మాత్రం ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఇటీవల కొన్ని ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొన్న ఉదయభాను (Udaya Bhanu), పరిశ్రమలో యాంకర్లకు ఎదురవుతున్న సమస్యలపై బహిరంగంగా మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉదయభాను మాట్లాడుతూ – “ఇండస్ట్రీలో యాంకరింగ్ ఒక గ్రూపుల ఆధీనంలో నడుస్తోంది. కొందరు వ్యక్తులు సిండికేట్‌లా వ్యవహరిస్తున్నారు.

సిండికేట్ ఆరోపణలు

ఎవరు ఈవెంట్ చేయాలి, ఎవరు చేయకూడదు అన్నది వారు నిర్ణయిస్తారు. ప్రతిభ ఉన్నవారికంటే సంబంధాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు” అని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఉదయభాను మాట్లాడుతూ, ఈ రంగంలో తనకు ఎదురైన అనుభవాలే తనను అలా మాట్లాడేలా చేశాయని చెప్పారు. ఎన్నోసార్లు ఈవెంట్ కు రెడీ అయి వెళ్లిన తర్వాత, ఆ ఛాన్స్ మరొకరికి వెళ్లిందని తెలిసి వెనక్కి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆమె తెలిపారు. కొన్ని ఛానల్స్ (Some channels) తన డేట్స్ తీసుకుని, ఆ తర్వాత తనకు సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రాజెక్ట్ నుంచి తీసేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హయ్యెస్ట్ పెయిడ్ యాంకర్’ అంటూ తనకు ట్యాగ్ వేసినప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరని ఆమె అన్నారు. తనకు ఇచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అయ్యాయో తమ ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుందని ఉదయభాను తెలిపారు. తాను ఎప్పుడూ సెలెక్టివ్ గా ఉంటానని చెప్పారు.

Udaya Bhanu

ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయాలను

చిన్న ఇంటర్వ్యూలు చేస్తే చిన్న యాంకర్ల భవిష్యత్తు దెబ్బతీసినట్టు అవుతుందనే భావనతో చిన్న ఇంటర్వ్యూలు ఒప్పుకునేదాన్ని కాదని తెలిపారు.త్వరలోనే అన్ని విషయాలను బహిర్గతం చేస్తానని, ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద యుద్ధాలే జరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయాలను బహిరంగంగా చెపుతానని, ఆరోజు పెద్ద రచ్చ జరుగుతుందని చెప్పారు. తాను ఎవరినో కించపరచడానికి మాట్లాడటం లేదని, వచ్చే తరం వారికి కొద్దిపాటి అవగాహన కల్పించేందుకే మాట్లాడుతున్నానని అన్నారు. తన అభిప్రాయాలలో ఉండే ఫిలాసఫీ కెరీర్ నేర్పిన జీవిత పాఠాల వల్ల వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాస్తున్నానని చెప్పారు.  

బుల్లితెరపై ఉదయభాను కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది?

1990ల చివర్లో ఆమె టీవీ యాంకరింగ్‌లో అడుగు పెట్టారు. “సాహసం చెయ్యరా దిమ్మతిరిగే” వంటి గేమ్ షోలు, పలు సినిమా ప్రమోషన్ ఈవెంట్ల ద్వారా పాపులర్ అయ్యారు.

ఉదయభాను యాంకరింగ్‌లో ప్రత్యేకత ఏమిటి?

ఆమె హై ఎనర్జీ లెవెల్, ఫుల్ ఆఫ్ హ్యూమర్, స్పాంటేనియస్ టాకింగ్, మరియు ఆడియన్స్‌ను ఆకట్టుకునే స్కిల్స్ వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/romantic-movie-thalaiva-thalaivi-to-hit-ott/cinema/531078/

anchor issues event promotions industry politics Pre Release Event Second Innings telugu anchor Telugu News tv industry udayabhanu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.