📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijay Sangeetha Divorce: విజయ్-సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijay Sangeetha Divorce: టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత, తమ విడాకుల కేసు ముగిసే వరకు చెన్నై నీలంకరైలోని ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని కోరుతూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, తాము కలిసి ఉన్న ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని ఆమె కోరడం చర్చనీయాంశమైంది.

Read Also: Gaddar Film Awards 2025: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

ఆ ఇంట్లో నాకు సగం వాటా ఉంది!

సంగీత తన పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. “నీలంకరైలోని ఇంట్లో తనకు సగం వాటా ఉందని, విడాకుల కేసు ముగిసే వరకు, తాను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలని ఆమె తన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌తో ఆమె మరోసారి అందరినీ షాక్‌కు గురిచేశారు.

విజయ్ నుంచి విడాకులు కోరుతూ కొద్దిరోజుల క్రితం సంగీత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో గత నెల 24న ఆమె పిటిషన్ వేసింది. 2021లో ఓ నటితో విజయ్ కు వివాహేతర సంబంధం ఏర్పడటం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఏప్రిల్ 20న వారి విడాకుల పిటిషన్ విచారణకు రానుంది. ఆ రోజు కోర్టుకు విజయ్ హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే నోటీసు ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Court Petition Chennai House Neelankarai House TVK Chief Vijay Vijay Sangeetha Divorce

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.