📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News:  Samantha: మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ: సమంత

Author Icon By Anusha
Updated: September 29, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న నటి సమంత (Samantha) సోషల్‌ మీడియా వేదిక ద్వారా తన అనుభవాలను పంచుకోవడం ఇప్పుడు అభిమానుల మధ్య పెద్ద చర్చగా మారింది. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో చేసిన పోస్టు కేవలం ఒక సింపుల్‌ మెసేజ్‌ మాత్రమే కాదు, ఆమె జీవితం నుంచి నేర్చుకున్న పాఠాల సమాహారంగా ఉంది. జీవితం, ప్రేమ, ఆత్మవిశ్వాసం వంటి విషయాలపై ఆమె రాసిన ప్రతి వాక్యం ప్రస్తుతం యువతను ఆలోచింపజేస్తోంది.

Betting app : సెలబ్రిటీలకు భారీ షాక్ : బెట్టింగ్ యాప్ కేసులో ED చర్యలు

తన ఇరవై ఏళ్ల వయసులో గడిపిన కాలాన్ని

సమంత ఈ పోస్టులో తన ఇరవై ఏళ్ల వయసులో గడిపిన కాలాన్ని గుర్తుచేసుకుంది. “ఆ వయసులో నేను ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా లేకుండా నిరంతరం ఆరాటపడుతూ గడిపాను” అని ఆమె తెలిపింది.

గుర్తింపు కోసం చేసిన ప్రయత్నాలు, విజయం కోసం పడ్డ శ్రమ, బయటకి కనిపించే మెరిసే ఇమేజ్‌ (Image) వెనుక ఉన్న బాధలను ఎవరూ అర్థం చేసుకోలేదని ఆమె పేర్కొంది. తాను బయటకు బలంగా కనిపించినా, లోపల మాత్రం ఎంతో సున్నితమైన దశను అనుభవించానని ఆమె చెప్పింది.

మనసులో పుట్టే నిజమైన ప్రేమే గొప్పదని

అలాగే, “ఆ వయసులో నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేదు” అని ఆమె ముక్కుసూటిగా రాసింది. సమాజం చెప్పే ప్రేమ కంటే, మనసులో పుట్టే నిజమైన ప్రేమే గొప్పదని, దానిని మనలోనే వెతకాలని ఆమె సూచించింది.

“ప్రేమ బయట నుంచి రాదు. నిజమైన ప్రేమ మన మనసులోనే పుడుతుంది. మనల్ని మనం అర్థం చేసుకోవడం, స్వీకరించడం, గౌరవించడం – ఇదే నిజమైన ప్రేమ” అని సమంత స్పష్టం చేసింది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇప్పుడు ముప్పైల్లోకి వచ్చిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని సమంత చెబుతోంది. “గతంలో చేసిన తప్పుల జ్ఞాపకాలను మోయడం మానేశాను. అన్నింటి వెంట పరుగులు పెట్టడం ఆపేశాను.

పబ్లిక్‌లో ఒకలా, ఒంటరిగా మరోలా ఉండడం మానేశాను, ప్రతి అమ్మాయి నాలాంటి దృక్పథాన్ని అలవరచుకోవాలి”  ఆమె ఆకాంక్షించారు. “పరుగులు తీయడం ఆపేసి జీవితాన్ని ఆస్వాదించాలి. మీరు మీలా ఉన్నప్పుడే గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండగలరు. అప్పుడే స్వేచ్ఛగా జీవించగలరు” అని ఆమె రాసుకొచ్చారు.
 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News latest news Life Lessons love and self confidence personal experiences Telugu News Tollywood actress Samantha twenties confusion thirties clarity viral social media post

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.