దక్షిణ భారత ప్రముఖ నటి త్రిష గత కొంతకాలంగా సినిమాలపై దృష్టి పెట్టి, వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుతోంది. అయితే, తాజాగా ఆమె పెళ్లి గురించి టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. వార్తల ప్రకారం, చండీగఢ్‌కు చెందిన యువ వ్యాపారవేత్తతో త్రిష(Trisha) వివాహం ఖరారవుతోందని సమాచారం. ఆ యువకుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడి వ్యాపారం నిర్వహిస్తూ, ఇటీవల భారత్‌లో తన బిజినెస్‌ను విస్తరించాడని చెబుతున్నారు. ఇరు కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకరించగా, త్రిష కూడా ఓకే చెప్పినట్లు చర్చ.
Read Also: BSF: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు రంగం లో దిగిన బిస్ ప్
ఇక త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’‘(Vishvambhara)’ సినిమాలో నటిస్తోంది. అదనంగా, తమిళంలో ‘కరుప్పు’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపై ఆమెకు పెద్ద ఆశలు ఉన్నాయి. గతంలో ఉన్న క్రేజ్ తగ్గిన నేపథ్యంలో, ఈ సినిమాలతో మళ్లీ తన కెరీర్‌ను బలంగా నిలబెట్టుకోవాలనుకుంటోంది.
అలాగే బాలీవుడ్‌లో కూడా త్రిష(Trisha) మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోందని సమాచారం. ఒకే సినిమాతో తన హిందీ ప్రయాణం ఆగిపోయినా, ఇప్పుడు కొత్త స్క్రిప్టులు వింటోందట. అయితే, త్రిష పెళ్లి గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అభిమానులు మాత్రం “ఈసారి పెళ్లి ఖాయమే” అంటూ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
త్రిష పెళ్లి ఎవరితో జరుగుతోంది?
చండీగఢ్‌కు చెందిన, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ యువ వ్యాపారవేత్తతో త్రిష వివాహం ఖరారవుతుందన్న ప్రచారం ఉంది.
త్రిష ప్రస్తుత ప్రాజెక్టులు ఏమిటి?
ఆమె ప్రస్తుతం ‘విశ్వంభర’ (చిరంజీవి తో) మరియు తమిళ చిత్రం ‘కరుప్పు’ లో నటిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: