📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tamil Nadu: బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం

Author Icon By Anusha
Updated: February 16, 2026 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ప్రముఖ నటి త్రిష కృష్ణన్ తీవ్రంగా స్పందించారు. “అగౌరవాన్ని ఖండించాల్సిందే, ఎప్పుడైనా సరే” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వివాదంపై తన న్యాయవాది ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసి, తన రాజకీయ వైఖరిపై పూర్తి స్పష్టత ఇచ్చారు.

Read Also: Prabhas Health Update: ప్రభాస్ గాయాల వార్తలపై మూవీ టీం స్పష్టత

రాజకీయాలతో ముడిపెట్టవద్దు

రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇంతటి అనుచిత వ్యాఖ్యలు వస్తాయని తాను ఊహించలేదని త్రిష తన న్యాయవాది నిత్యేశ్ నటరాజ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని తేల్చి చెప్పారు. తనను కేవలం తన నటన, వృత్తిపరమైన జీవితంతోనే గుర్తించాలని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆమె కోరారు.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఇటీవల నటుడు విజయ్, సేలంలో నిర్వహించిన రాజకీయ ర్యాలీని విమర్శిస్తూ, రాజకీయాల్లో ఆయనకు అనుభవం లేదని చెప్పే క్రమంలో నైనార్ నాగేంద్రన్.. “విజయ్ ముందు నటి త్రిషతో రిలేషన్ నుంచి బయటకు రావాలి.. అప్పుడే రాజకీయ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమవుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Nainar Nagendran comments Tamil Nadu Telugu News Trisha Krishnan statement vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.