దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి త్రిష (Trisha) కృష్ణన్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా పెళ్లి, రాజకీయాల్లోకి వస్తున్నారన్న వదంతులు నిరాధారమని ఆమె స్పష్టం చేసారు..
Read Also: Prithviraj Sukumaran: ఈ కథకు మహేశ్ అర్హుడు: పృథ్వీరాజ్
నిరాధార వార్తలు తనకు అసహ్యం కలిగిస్తున్నాయని
స్నేహితులతో దిగిన ఫొటోలను వక్రీకరించి, అవాస్తవ కథనాలను జోడించి ప్రచారం చేయడంపై త్రిష (Trisha) మండిపడ్డారు. “నేను ఎవరితో ఫొటో దిగితే వారితో పెళ్లి జరిగినట్టేనా? ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారు?” అంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
ఇలాంటి నిరాధార వార్తలు తనకు అసహ్యం కలిగిస్తున్నాయని, ఫేక్ న్యూస్ ప్రచారాన్ని వెంటనే ఆపాలని ఆమె పరోక్షంగా హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: