TPCC Chief: మహేష్ గౌడ్‌కు విజయ్-రష్మిక పెళ్లి ఆహ్వానం

Read Time:  1 min
TPCC Chief: మహేష్ గౌడ్‌కు విజయ్-రష్మిక పెళ్లి ఆహ్వానం
FONT SIZE
GET APP

TPCC Chief: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు స్పష్టమైంది. పెళ్లి పనులు ప్రారంభించిన కుటుంబ సభ్యులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేసే ప్రక్రియను మొదలుపెట్టారు.

సోమవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నివాసంలో విజయ్ దేవరకొండ బాబాయి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్, రష్మికల వివాహానికి రావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేఖను అందజేశారు.

Read Also: Vijay Deverakonda-Rashmika: ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక 

TPCC Chief: మహేష్ గౌడ్‌కు విజయ్-రష్మిక పెళ్లి ఆహ్వానం
TPCC Chief: Mahesh Goud invited to Vijay-Rashmika’s wedding

ఆహ్వానాన్ని స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్, త్వరలో ఒక్కటి కాబోతున్న నూతన జంటకు తన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. వధూవరులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాజకీయ ప్రముఖులకు పెళ్లి ఆహ్వానాలు అందజేయడం ప్రారంభం కావడంతో, త్వరలోనే వివాహ తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.