Toxic Movie Teaser Release: ‘టాక్సిక్’ టీజర్ వచ్చేసింది

Read Time:  1 min
Toxic Movie Teaser Release: ‘టాక్సిక్’ టీజర్ వచ్చేసింది
FONT SIZE
GET APP
Toxic Movie Teaser Release: ‘Toxic’ teaser is out
Toxic Movie Teaser Release: ‘Toxic’ teaser is out

Toxic Movie Teaser Release: రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ టీజర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.. టీజర్ ఆ అంచనాలను మరింత పెంచింది.విడుదలైన టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. 1.55 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో భారీ విధ్వంసం, తీవ్ర హింసాత్మక సన్నివేశాలు చూపించారు. యష్ ‘రాయ’ అనే డార్క్ పాత్రలో కనిపిస్తూ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.

Read Also: Anirudh ravichander : హైదరాబాద్‌లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!

యూట్యూబ్ లో దూసుకుపోతుంది

‘అందరితో విరోధం పెట్టుకొని బతకలేవు… పట్టుదల వదిలేయ్’ అనే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. టీజర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో #Yash19 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.ఈ సినిమాను రెట్రో స్టైల్ లో రూపొందిస్తున్నారు. గీతుతో పాటు యష్ కూడా ఈ సినిమాకి కథ రాశారు. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

కేజీఎఫ్ చిత్రాల తర్వాత మరోసారి తన మాసివ్ లుక్, యాక్టింగ్ తో బ్లాస్ట్ చేస్తేందుకు రెడీ అయ్యారు యష్. KVN ప్రొడక్షన్స్, మాన్‌స్టర్‌ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె. నారాయణ, య‌ష్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న“టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్”, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఒకేసారి విడుదల చేయనున్నారు మేకర్స్.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.