Toxic Movie: కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic) చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా, చిత్ర బృందం ప్రమోషన్ల విషయంలో అత్యంత గోప్యత పాటిస్తోంది. కేవలం మూడు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో, చిత్ర యూనిట్ అధికారికంగా పెద్దగా సమాచారం వెల్లడించకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా నిడివి (రన్‌టైమ్) మరియు సెన్సార్ వ్యవహారాలపై కొన్ని కీలక వార్తలు లీక్ అయ్యాయి.
Read Also:Vijay Rashmika Marriage: ఒకటైన ‘గీత గోవిందం’ జంట
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘టాక్సిక్’ సినిమా రన్‌టైమ్ కేవలం 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉండబోతోంది. ఈ రోజుల్లో భారీ యాక్షన్ సినిమాలు 3 గంటలకు పైగా నిడివితో వస్తుండగా, యష్ సినిమా ఇంత తక్కువ రన్‌టైమ్‌తో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ నిర్ణయించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో ప్రధానంగా రాయన్ అనే పాత్ర నేపథ్యాన్ని, అతని సాహసాలను చూపించి, క్లైమాక్స్‌లో అతని కొడుకు పాత్రను పరిచయం చేస్తూ సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇస్తారని సమాచారం.
మరోవైపు, ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ ప్రక్రియపై కూడా చిత్ర బృందం అప్రమత్తమైంది. సినిమాపై ఇప్పటికే సెన్సార్ బోర్డుకు కొన్ని ఫిర్యాదులు అందడంతో, చివరి నిమిషంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్లాన్ చేసిన దానికంటే ముందుగానే సెన్సార్ బోర్డుకు సినిమాను పంపుతున్నారు. వచ్చే వారమే సెన్సార్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ ప్రాజెక్ట్, కేవలం రెండున్నర గంటల సినిమాగా మాత్రమే వస్తుందంటే అది కచ్చితంగా రెండు భాగాలుగా వచ్చే అవకాశమే మెండుగా ఉందని అభిమానులు విశ్లేషిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: