Top Telugu Films 2025 : 2025లో టాలీవుడ్ బాక్సాఫీస్ గతేడాదిలా దుమ్మురేపలేకపోయింది. భారీ బడ్జెట్‌లతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో లాభాలు సాధించలేకపోయాయి. అయితే, చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలే ఈ ఏడాది నిజమైన విజేతలుగా నిలిచాయి. వెంకటేష్ నుంచి నాని వరకూ అందరూ ఆశ్చర్యపోయేలా ఒక రొమాంటిక్ సినిమా టాప్‌లో నిలిచింది.
Read also: Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త
ఈ ఏడాది భారతీయ సినిమాకు ప్రేమ కథల సంవత్సరం అని చెప్పాలి. అన్ని భాషల్లోనూ ప్రేమ కథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. (Top Telugu Films 2025) అదే కోవలో తెలుగులో ‘లిటిల్ హార్ట్స్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుని రూ.26.47 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. రూ.24.47 కోట్ల లాభంతో ఈ సినిమా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ 1223.5 శాతానికి చేరుకుంది.
టాప్ స్థానంలో ‘లిటిల్ హార్ట్స్’ నిలవగా, రెండో స్థానాన్ని కూడా ఒక గ్రామీణ ప్రేమకథే దక్కించుకుంది. ఏడాది చివర్లో విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా రూ.2.5 కోట్ల పెట్టుబడిని భారీ లాభంగా మార్చి 608.8 శాతం లాభాన్ని అందుకుంది. ఈ సినిమాలు చిన్న సినిమాల సత్తాను మరోసారి నిరూపించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: