టాలీవుడ్ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సినీ షూటింగ్ సెట్లలో పనిచేసే కార్మికులు 30 శాతం వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు కూడా బంద్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నిరసన కారణంగా పలు చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయి నిర్మాతలకు భారీగా నష్టం జరుగుతోంది. కార్మికుల పెడరేషన్ సంఘం (Workers’ Federation Association) ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిని కలసి తమ సమస్యలను వివరించనుంది. పరిశ్రమలో ఉన్న సమస్యలపై త్వరిత పరిష్కారం దొరకాలని సినీ వర్గాలు కోరుకుంటున్నాయి.సినీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం స్థాయిలో కాకుండా, పరిశ్రమలో ఉన్న పెద్దల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా పరిశ్రమలో గౌరవనీయ స్థానంలో ఉన్న చిరంజీవిని కలవాలని నిర్ణయించారు.
ప్రస్తుతం కార్మికులకు
పరిశ్రమ సమస్యలు పరిష్కరించడంలో ఆయన పలు మార్లు మధ్యవర్తిత్వం చేసిన సంగతి తెలిసిందే. అందుకే కార్మికులు తమ సమస్యలపై న్యాయమైన పరిష్కారం రావడానికి ఆయన సహకరిస్తారని నమ్ముతున్నారు.మరోవైపు సినీ నిర్మాతలు (Film producers) ఇప్పటికే చిరంజీవిని కలసి తమ వాదనలు వివరించారు. ప్రస్తుతం కార్మికులకు రోజువారీ సగటు రూ.2000 చెల్లిస్తున్నామని, ఇది ఇతర పరిశ్రమలతో పోలిస్తే చాలా ఎక్కువ అని వారు తెలిపారు. అదనంగా వేతనాలను 30 శాతం పెంచడం అసాధ్యమని స్పష్టం చేశారు. 70 శాతం కార్మికులకు ఇప్పటికే అధిక వేతనాలు ఇస్తున్నామని, కానీ టైం పాస్ చేసే కొంతమంది కార్మికులు మాత్రమే బంద్ కోసం ఒత్తిడి పెంచుతున్నారని నిర్మాతలు మండిపడ్డారు. నిజంగా పని చేసే కార్మికులకు ఇలాంటి బంద్ అవసరం లేదని వారు పేర్కొన్నారు.
టాలీవుడ్ చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది?
1921లో విడుదలైన “భీష్మ ప్రతిజ్ఞ” మొదటి తెలుగు మౌన చిత్రం. 1931లో “భక్త ప్రహ్లాద” మొదటి తెలుగు టాకీ చిత్రం. అప్పటి నుంచి టాలీవుడ్ అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
టాలీవుడ్‌లో ప్రసిద్ధ హీరోయిన్లు ఎవరు?
సమంత, అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, తమన్నా, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, సాయి పల్లవి, శ్రుతి హాసన్ వంటి నటీమణులు టాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందినవారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: