📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Tollywood: సినీ కార్మికులతో చిరంజీవి భేటీ.. సక్సెస్ దిశగా అడుగులు

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ పరిశ్రమలో గత పదిహేనురోజులుగా కొనసాగుతున్న కార్మికుల బంద్‌ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కాకుండా సినీ అభిమానుల మధ్య కూడా హాట్‌టాపిక్‌గా మారింది. షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోవడంతో అనేక సినిమాలు అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. నిర్మాతలు పెట్టుబడులు పెట్టి షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేసుకున్నా, కార్మికులు బంద్‌ కారణంగా ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది.కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని పట్టుదలగా చెబుతున్నారు. వేతనాల పెంపు, పని గంటల నియంత్రణ, భద్రతా చర్యలు వంటి అంశాలు వారి ప్రధాన డిమాండ్లు.ఇక నిర్మాతల సంఘం (Association of Producers) మాత్రం తమకు సాధ్యమైన దానికంటే ఎక్కువ డిమాండ్లను అంగీకరించలేమని స్పష్టం చేస్తోంది. సినిమా రంగం ఇప్పటికే పలు సమస్యలు ఎదుర్కొంటోందని, థియేటర్లలో కలెక్షన్లు తగ్గిపోతున్నాయని, ఓటీటీ పోటీ ఎక్కువైందని, ఈ పరిస్థితుల్లో అదనపు భారం మోసేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు.

ఎవరి మధ్య విభేదాలు వచ్చినా దాసరి ముందుకు వచ్చి

ఇరు వర్గాలు తమ తమ మొండిపట్టు విడవకపోవడంతో సమస్య పరిష్కారం అవ్వడం కష్టంగా కనిపిస్తోంది.ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలో ఒక పెద్ద మధ్యవర్తి అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. గతంలో దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) లాంటి నేతృత్వం ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు చిటికెలో పరిష్కారం అయ్యేవని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కార్మికులు, నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు, ఎవరి మధ్య విభేదాలు వచ్చినా దాసరి ముందుకు వచ్చి తన అనుభవంతో, ప్రబావంతో పరిష్కారం చూపేవారు. ఆయన లేకపోవడంతో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చాలామంది సినీ ప్రముఖులు బాధపడుతున్నారు.ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా నిలుస్తున్నారని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన మధ్యవర్తిత్వం చేసి సమస్యలను పరిష్కరించిన ఉదాహరణలు ఉన్నాయి.

సుమారు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో

అందుకే ఈసారి కూడా బంద్‌ అంశం చిరంజీవి కోర్టులోకి చేరింది. కార్మికులు, నిర్మాతలు – ఇద్దరూ ఆయన సూచనలను గౌరవిస్తారని విశ్వాసం ఉంది. చిరంజీవి ముందుకు వస్తే సమస్య సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ అంతటా చర్చ జరుగుతోంది.వారి సమస్యలన్నింటినీ విన్న చిరంజీవి సోమవారం 24 క్రాఫ్ట్‌కి చెందిన 72 మది సభ్యులతో సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో చిరంజీవి ఒక సెలబ్రెటీ, సీనియర్ అన్నట్లుగా కాకుండా ఓ సినీ కార్మికుడిగా వారి సమస్యలన్నీ విన్నారు.ఈ సందర్భంగా కార్మికులు, నిర్మాతల మధ్య పెరుగుతోన్న అంతరంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. 15 రోజులుగా వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్నామని, చిరంజీవి తమను పిలిచి ఈ విషయంపై మాట్లాడి తమ సాధక బాధలన్నింటినీ అడిగి తెలుసుకున్నారని తెలిపారు.

Tollywood

కాల్‌షీట్ మాత్రమే ఇస్తామనడం దారుణమని

కొందరు నిర్మాతలు సమస్యలు వినకుండానే తమపై అకారణంగా నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు నిర్మాతలు కూడా బాగుండాలని కోరుకుంటామని, వాళ్లు పెట్టిన వర్కింగ్ కండిషన్స్‌లో రెండు తీవ్ర అభ్యంతరంగా ఉండటంతోనే వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ పరిస్థితి గురించి చిరంజీవికి అన్ని వివరించామన్నారు.రెండో ఆదివారంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో పనికి మాత్రమే డబుల్ కాల్‌షీట్లు ఇస్తామనడం, మిగతా ఆదివారాల్లో సింగిల్ కాల్‌షీట్ మాత్రమే ఇస్తామనడం దారుణమని వల్లభనేని అనిల్ అన్నారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లామని, తమ బాధలన్నీ విని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్మొహమాటంగా తన దగ్గరికి రావొచ్చని ఆయన భరోసా ఇచ్చారన్నారు. చర్చలకు ఫిల్మ్ ఛాంబర్‌ నుంచి పిలుపు వచ్చింది కనుక ప్రస్తుతానికి నిరసన కార్యక్రమం ఆపివేస్తున్నామని.. వేతనాల విషయంలో సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు అనిల్ తెలిపారు.

చిరంజీవి అసలు పేరు ఏమిటి?

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్.

ఆయన సినీ రంగంలో ఎప్పుడు ప్రవేశించారు?

1978లో వచ్చిన పునాది రాళ్లు అనే చిత్రంతో చిరంజీవి సినీ రంగంలో అడుగుపెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/aamir-khans-brother-accuses-mother/cinema/actor/532256/

demands unresolved film industry shutdown producers vs workers shooting halted Telugu News Tollywood Strike workers protest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.