📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tollywood: సిల్వర్‌ స్క్రీన్‌ మీద జేసీ దివాకర్‌రెడ్డి జీవితం.. ఆయన పాత్రలో టాలీవుడ్ ప్రముఖ యాక్టర్

Author Icon By Divya Vani M
Updated: October 25, 2024 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పుడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి హవా నడుస్తోందన్నది అందరికీ తెలిసిందే కానీ ఒకప్పుడు ఆయన తమ్ముడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల్లో ఒక పెద్ద సెన్సేషన్‌ అని చెప్పుకోవచ్చు. ఆయన మాట్లాడిన ప్రతి మాట చేసిన ప్రతి పని రాజకీయంగా ఒక సంచలనం అవుతుండేది రాయలసీమ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి ఒక చరిత్రగా నిలిచారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దాదాపు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తాడిపత్రి కేంద్రంగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు ఇప్పుడు ఆయన వారసత్వం ప్రభాకర్ రెడ్డి చేతుల్లోకి వెళ్లబోతుందని వచ్చిన ప్రచారం, రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

జేసీ దివాకర్ రెడ్డి ఏదైనా మాట్లాడితే అది రాజకీయ బాంబుగా పేలిపోయేది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు పెద్ద చర్చలకు దారితీసేవి. అందుకే ఆయనకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో జేసీ పేరు తెలియనివారు ఉండరు జేసీ దివాకర్ రెడ్డిని రాజకీయాల్లో మరో పెద్ద వివాదంగా నిలబెట్టిన విషయం పరిటాల రవి హత్యకుట్ర అప్పట్లో ఆయనపై వచ్చిన ఈ ఆరోపణలు ఒక పెద్ద సంచలనంగా మారాయి. విచారణలో ఆయనకు క్లీన్ చిట్ లభించినప్పటికీ ఈ వివాదం జేసీ రాజకీయ జీవితానికి చాలా ప్రభావం చూపించింది. రక్త చరిత్ర చిత్రంలో జేసీ ఫ్యామిలీ ప్రస్తావన లేకపోవడం కూడా దీనికి సంబంధించి చర్చనీయాంశం అయింది.

ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి జీవితంపై బయోపిక్ తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ వార్త తెరపైకి రావడంతో అందరిలోనూ ఒక ప్రశ్న మొదలైంది ఆ బయోపిక్‌లో ఏమేం అంశాలు చూపించబోతున్నారు రాయలసీమ రాజకీయాల్లో జేసీ పాత్రను పక్కాగా చూపించాలంటే ఆయనకి పరిటాల కుటుంబంతో ఉన్న వైరం వైఎస్ కుటుంబంతో ఉన్న సంబంధాలు విభేదాలు వంటివి అందులో చోటు చేసుకోవాలి అవన్నీ నిజంగా బయోపిక్‌లో ఉంటాయా అనే చర్చ కూడా మొదలైంది బయోపిక్ కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలైందని సమాచారం జేసీ దివాకర్ రెడ్డి పాత్రను ఎవరు పోషిస్తారన్నది పెద్ద చర్చగా మారింది ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ జేసీ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం బలంగా వినిపిస్తోంది ఇటీవల రాజేంద్రప్రసాద్ తన కుమార్తె మరణం సందర్భంగా కనిపించినప్పుడు ఆయనను చూసి జేసీ దివాకర్ రెడ్డి పోలికలు గుర్తుకు వచ్చాయని చెప్పుకుంటున్నారు.

జేసీ విజయాలతో పాటు ఆయన వివాదాస్పద జీవితానికి సంబంధించిన అంశాలు కూడా బయోపిక్‌లో ఉంటాయా అనే అంశం చాలా ఆసక్తిగా మారింది జిల్లాలో ఆయనకి పరిటాల రవితో ఉన్న వైరం రాజకీయాలు ముక్కుసూటి వ్యాఖ్యలు అన్నీ కచ్చితంగా ఈ చిత్రంలో చూపించాల్సిన అంశాలే. ఇలాంటి నాయకుడి జీవితం పై తీయబోయే బయోపిక్ ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

AnantapurPolitics JCBiopic JCDiwakarReddy JCDiwakarReddyBiography JCDynasty JCFamilyFeuds JCvsParitalaRavi ParitalaRavi PoliticalControversies RajendraPrasad RayalaseemaHistory RayalaseemaLeaders RayalaseemaPolitics TeluguPolitics TollywoodBiopics YSRPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.