This week OTT : ఈ వారం ఓటీటీల్లో వినోదం పండుగే. 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకులను (This week OTT) ఆకట్టుకుంటోంది.
‘ది 100’ అనే పోలీస్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ధన్య బాలకృష్ణ, ఆర్కే సాగర్ కీలక పాత్రల్లో కనిపించారు.
అదే విధంగా ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్ నటించిన ‘మెట్రో ఇన్ డినో’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా రిలేషన్‌షిప్‌ల నేపథ్యంలో సాగుతుంది.
కొరియన్ రొమాంటిక్ డ్రామా ‘లవ్ అన్‌టాంగిల్డ్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘భాగ్ సాలే’ ఇప్పుడు ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
అంతేకాదు, Netflix, Amazon Prime, Jio Cinema, Sony LIV, Aha వేదికలపై మరెన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉన్నాయి.
Read also :