📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

The Raja Saab: బాబోయ్.. ‘రాజాసాబ్’ టికెట్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!

Author Icon By Tejaswini Y
Updated: January 3, 2026 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Read also: Tirumala: శ్రీవారి సేవలో నటుడు సుమన్

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించగా, సంజయ్ దత్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో కీలక చిత్రంగా నిలవనుందని మేకర్స్ భావిస్తున్నారు.

The Raja Saab: You’ll be shocked to hear the ticket price for ‘Raja Saab’!

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ, రిలీజ్ దగ్గర పడే కొద్దీ బుకింగ్స్ పుంజుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ సినిమాలకి మొదటి రోజు ఓపెనింగ్స్ బలంగా ఉంటాయనే నమ్మకం మేకర్స్‌లో కనిపిస్తోంది. ఇక సినిమా విడుదలకు ఒక రోజు ముందే అంటే జనవరి 8న స్పెషల్ ప్రీమియర్ షోలు నిర్వహించాలనే ప్లాన్‌లో యూనిట్ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ సంఖ్యలో ప్రీమియర్స్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియా టాక్ ప్రకారం, ఈ ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు రూ.800 వరకు ఉండే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.

ఇటీవల కాలంలో స్పెషల్ షోలకు అధిక టికెట్ రేట్లు వసూలు చేసిన కొన్ని సినిమాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ చిత్రమైన ‘పుష్ప 2’ కూడా ప్రారంభ దశలో ఎక్కువ రేట్లతో పూర్తి హౌస్‌లు సాధించలేకపోయిన ఉదాహరణ ఉంది. ఈ నేపథ్యంలో ‘ది రాజా సాబ్’కు కూడా అధిక ధరలు వసూలు చేయడం కలెక్షన్లపై ప్రభావం చూపుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వ అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో అక్కడ జనవరి 8 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం స్పెషల్ షోలు, ప్రీమియర్స్‌కు అనుమతులు ఇవ్వడంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలో ప్రీమియర్ షోలు ఉంటాయా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Maruthi Director Pan India Movie Prabhas prabhas new movie raja saab movie Sankranti Releases Telugu Cinema News The Raja Saab

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.