📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: The Paradise Movie: ది ప్యార‌డైజ్‌.. మోహ‌న్ బాబు ఫ‌స్ట్ లుక్ విడుదల

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ (The Paradise) సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నారు. దసరా సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ పెట్టుకొని, అత్యున్నత స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. సినిమాలో విలన్ ఎవరనేది మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Thamma Movie: థామా ట్రైలర్ లో హైలైట్స్

ది పారడైజ్ మూవీ (The Paradise Movie) లో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల మంచు లక్ష్మి ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేసింది. ఈ క్రమంలో శనివారం ఉదయం మోహన్ బాబు ఈ సినిమాలో నటిస్తున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

శికంజా మాలిక్ అనే పాత్రలో లెజెండరీ మోహన్ బాబు (Mohan Babu) నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు షర్ట్ లేకుండా చైర్ మీద కూర్చొని స్టైల్ గా సిగారెట్ (Cigarette) తాగుతూ రగ్గడ్‌ లుక్‌లో కనిపించారు. బ్యాగ్రౌండ్ లో తుపాకులు, చేతి కింద పెద్ద కత్తి, చేతులకు అంటిన రక్తం మరకలు చూస్తుంటే.. సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందనేది ఓ ఐడియా వస్తుంది.

కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా

నానిని జడల్ అనే పాత్రలో ఇతకముందెన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేసిన శ్రీకాంత్ ఓదెల.. మోహన్ బాబుని కూడా అలానే చూపించారు.ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది (2026) మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రం 1980ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

anirudh ravichander music First Look Release Manchu Mohan Babu Nani srikanth odela director The Paradise Movie upcoming telugu film

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.