📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Series Review: సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ

Author Icon By Aanusha
Updated: October 10, 2025 • 6:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు ప్రేక్షకులలో ప్రతిష్టాత్మక స్థానం సంపాదించడమే కాక, OTT ప్లాట్‌ఫారమ్‌లలో విభిన్న రకాల కంటెంట్‌కు మార్కెట్‌ను ఏర్పరుస్తున్నాయి. దారుణ, ఆసక్తికర శైలిలో రూపొందిన సిరీస్ తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ‘సెర్చ్: ది నైనా మర్డర్ కేస్’. (Search The Naina Murder Case Series) ఈ సిరీస్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తోంది.

The Paradise movie: వాయిదా పడ్డ ది ప్యారడైజ్ సినిమా?

ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్లతో రూపొందించబడింది, OTT ప్లాట్‌ఫారమ్ జియో హాట్ స్టార్లో (Jio Hotstar) స్ట్రీమింగ్ అవుతుంది.కొంకణా సేన్ శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, రోషన్ సిప్పి దర్శకత్వం వహించాడు.మరి ఈ సిరీస్ ఎలా ఉందొ చూద్దాం.

కథ

ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఏసీపీ సంయుక్త దాస్ (Samyukta Das) ( కొంకణా సేన్ శర్మ) పనిచేస్తూ ఉంటుంది. తన భర్త భీషణ్ .. టీనేజ్ వయసులో ఉన్న కూతురు ‘మహీ’ కోసం ఎక్కువ సమయం గడపడలేకపోవడం వలన, వాళ్ల వైపు నుంచి అసంతృప్తి ఉంటుంది. దాంతో ‘అహ్మదాబాద్’ లో కొత్త ఇంటిని తీసుకున్న ఆమె అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుంది.

ఆమె స్థానంలోకి ఏసీపీ జై కన్వర్ (సూర్య శర్మ) కూడా వచ్చేస్తాడు. ఆమె రిలీవ్ అవుతున్న సమయంలోనే ఒక మర్డర్ కేసు వస్తుంది. ముంబై (Mumbai) లోని ఒక కాలేజ్ లో చదువుతున్న ‘నైనా’ అనే అమ్మాయి హత్య చేయబడుతుంది. ఆ ప్రాంతానికి జై కన్వర్ కొత్త కావడం వలన, ఈ కేసు కోసం మరో రెండు రోజులు కేటాయించమని పై అధికారి సంయుక్తను కోరతాడు.

Series Review

కథనం

ఆమెకి తోడుగా ఉండమని జై కన్వర్ ని ఆదేశిస్తాడు. దాంతో ఆమె రంగంలోకి దిగుతుంది. హంతకులు నైనాను హత్య చేసి .. ఓ కారులో ఆమె డెడ్ బాడీని ఉంచి, వర్షపు నీటితో నిండిన ఒక క్వారీలోకి తోసేస్తారు. ఆ బాడీని కనుక్కుని సంయుక్త బయటికి తీయిస్తుంది. డెడ్ బాడీ దొరికిన కారు, రాజకీయాలలో ఎదగాలనుకుంటున్న తుషార్ (శివ్ పండిట్)కి సంబంధించినది.

ఎలక్షన్స్ పనులపై తిరగటానికి ఆయన తెప్పించిన కార్లలో అది ఒకటి. అందువలన సంయుక్త ఆయనను అనుమానిస్తుంది. ఇక కాలేజ్ లో లవ్ అంటూ నైనా వెంటపడి వేధించిన స్టూడెంట్ ‘ఓజస్’ ను కూడా ఆమె సందేహిస్తుంది. అలాగే నైనాతో ఎక్కువగా ఛాటింగ్ చేసిన ప్రొఫెసర్ ‘రణధీర్’ పై కూడా ఓ కన్నేస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో ఆమెకి తెలిసే నిజాలు ఏమిటి? అసలు హంతకులు ఎవరు? అనేది మిగతా కథ. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

latest news Search: The Naina Murder Case Series Review Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.