ఈ మధ్య సినిమాల వరుస చూస్తే ఒక్క నిమిషం ఊపిరి తీసుకోలేరు! థియేటర్లు, ఓటీటీల్లో సినిమాల (OTT horror movie) పండుగ నడుస్తోంది. ప్రతి వారం కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన వార్ 2 ఇప్పటికే భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ కూడా రిలీజ్‌కి రోజు నుంచే హిట్ టాక్ అందుకుంది.ఈ రెండు సినిమాలు థియేటర్లలో అలవోకగా వంద కోట్లు దాటేశాయి.
ఓటీటీ వేదికగా సినిమాల హవా పెరుగుతోంది
కేవలం థియేటర్లలో కాదు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ సినిమాలు పెద్ద దుమ్ముదులుపుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా హవా కొనసాగిస్తున్నాయి.ప్రతి శుక్రవారం పది సినిమాల పైగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ప్రతి జానర్‌లోనూ సినిమాలు అందుబాటులో ఉన్నాయి.
హారర్ సినిమాలకు ప్రత్యేక ఆదరణ
ఇక వీటిలో హారర్ జోనర్ సినిమాలకున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆడియన్స్ భయపడుతూనే ఈ సినిమాల్ని ఆసక్తిగా చూస్తున్నారు.ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాని ఒంటరిగా చూడకపోవడమే మంచిది అంటున్నారు!ఈ సినిమా పేరు (“A Classic Horror Story”). నెట్‌ఫ్లిక్స్‌లో పదిహేడు భాషల్లో రిలీజ్ అయింది. సినిమా మొదలవగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది.ఇందులో నలుగురు ఫ్రెండ్స్ ఒక అడవిలోకి ట్రిప్‌కు వెళ్తారు. అకస్మాత్తుగా వాళ్ల కారు ఒక చెట్టును ఢీ కొడుతుంది.ఆ దగ్గరలో ఓ పాత వుడెన్ హౌస్ కనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్లకు బొమ్మలు కనిపిస్తాయి. కానీ వాటికి కళ్లు, చెవి, నోరు ఉండవు.వాటి స్థానంలో మనుషుల అవయవాలు ఉంటాయి! ఈ సీన్స్ చూసి ఫ్రెండ్స్ షాక్ అవుతారు.
బొమ్మల వెనక దాగున్న రహస్యాలు
ఎవరు ఆ బొమ్మలు పెట్టారు? ఎందుకు పెట్టారు? తెలుసుకునే ప్రయత్నంలో వాళ్లకు భయంకరమైన ట్విస్టులు ఎదురవుతాయి.ఆ ఇంట్లో కొంతమంది పూజలు చేస్తుంటారు. కానీ అక్కడ ఉన్నది మానవులు కాదు. కొందరు ముసుగు ధరించిన దుండగులు ఫ్రెండ్స్‌ని వెంటాడుతారు.వాళ్లను ఒకొక్కరుగా చంపడం మొదలవుతుంది. అసలు అది అడవి కాదు! వాళ్లు అక్కడికి ఎలా వచ్చారు అన్నది అసలు ట్విస్టు.ఈ సినిమా మొత్తం ఊహించని మలుపులతో నిండిపొయింది.క్లాస్ హారర్ సినిమాల కోసం వెయిటింగ్‌లో ఉన్నవాళ్లకు ఇది పర్ఫెక్ట్. ఒంటరిగా కాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి చూడడం బెటర్.
Read Also :